సంగం డెయిరీ దొంగ అతడే... మోయలేక 27లక్షలు వదిలేశాడు
గుంటూరు జిల్లా సంగం డెయిరీలో జరిగిన చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. నిందితుడిని గుర్తించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని వట్టిచెరుకూరు మండలం కురునూతలకు చెందిన వ్యక్తిగా తేల్చారు. శని, ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో డబ్బును క్యాషియర్ శ్రీధర్ డెయిరీ గదిలోని బీరువాలోనే భద్రపరిచాడు. మొత్తం 71 లక్షల 65వేలు బీరువాలో ఉంచి వెళ్లాడు. డెయిరీ బీరువాలోనే డబ్బు ఉందని తెలుసుకున్న నిందితుడు… గ్యాస్ కట్టర్ సాయంతో బీరువాను కోసి 44లక్షల 43వేలు ఎత్తుకెళ్లాడు. […]
గుంటూరు జిల్లా సంగం డెయిరీలో జరిగిన చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. నిందితుడిని గుర్తించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని వట్టిచెరుకూరు మండలం కురునూతలకు చెందిన వ్యక్తిగా తేల్చారు.
శని, ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో డబ్బును క్యాషియర్ శ్రీధర్ డెయిరీ గదిలోని బీరువాలోనే భద్రపరిచాడు. మొత్తం 71 లక్షల 65వేలు బీరువాలో ఉంచి వెళ్లాడు. డెయిరీ బీరువాలోనే డబ్బు ఉందని తెలుసుకున్న నిందితుడు… గ్యాస్ కట్టర్ సాయంతో బీరువాను కోసి 44లక్షల 43వేలు ఎత్తుకెళ్లాడు. మిగిలిన 27లక్షలు పది, ఇరవై రూపాయల నోట్లుగా ఉండడంతో మోయడానికి ఇబ్బంది అవుతుందని వదిలేసి వెళ్లిపోయాడు.
క్యాషియర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో గ్యాస్ కట్టర్‌పై నిందితుడు తన పేరు రాసుకుని ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. కురునూతల వెళ్లి ఆరా తీయగా గ్యాస్ కట్టర్ యజమానే దొంగ అని తేలిపోయింది.
నిందితుడు ఎవరన్నది తెలిసిపోయిందని… కాబట్టి ఇక అతడు తప్పించుకునే అవకాశమే లేదని పోలీసులు చెబుతున్నారు. కేసు ఇంకా దర్యాప్తులో ఉంది కాబట్టి మరిన్ని వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.