జగన్ ఆలోచనలు అంతుపట్టడం లేదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు ఏంటో తనకు అంతు చిక్కడం లేదని వ్యాఖ్యానించారు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య. అటు కేంద్రంతో గానీ, ఇటు ప్రతిపక్షాలతో గానీ కలిసి వెళ్లకుండా ఒంటరి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. అలా చేయడం వెనుక జగన్ ఆలోచన ఏంటో అర్థం కావడం లేదన్నారు. అయినా జగన్ తెలివైన వాడని… ఇలా చేస్తున్నారంటే ఏదో కారణం ఉంటుందని… కాబట్టి జగన్ పాలనపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. అప్పుడే తాను స్పందిస్తానని […]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు ఏంటో తనకు అంతు చిక్కడం లేదని వ్యాఖ్యానించారు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య. అటు కేంద్రంతో గానీ, ఇటు ప్రతిపక్షాలతో గానీ కలిసి వెళ్లకుండా ఒంటరి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు.
అలా చేయడం వెనుక జగన్ ఆలోచన ఏంటో అర్థం కావడం లేదన్నారు. అయినా జగన్ తెలివైన వాడని… ఇలా చేస్తున్నారంటే ఏదో కారణం ఉంటుందని… కాబట్టి జగన్ పాలనపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. అప్పుడే తాను స్పందిస్తానని రోశయ్య వ్యాఖ్యానించారు.
విశాఖలో మీడియాతో మాట్లాడిన రోశయ్య… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా ఖర్చులు, దుబారా తగ్గించుకోవడం మంచిదేనన్నారు. జగన్ దూకుడు ప్రదర్శిస్తూ మంచి పథకాలనే తీసుకొస్తున్నారని కితాబిచ్చారు.
అయితే వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేచిచూడాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనందున కేంద్రంతో సఖ్యత చాలా అవసరమని రోశయ్య సూచన చేశారు.