Telugu Global
National

ట్విట్టర్‌లో ఏపీ సీఎంవో , నీతి ఆయోగ్‌ సీఈవో మధ్య చర్చ

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం తెచ్చిన చట్టంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ మీడియా ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేక కథనాలు రాస్తోంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్విట్టర్లో స్పందించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ద ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేశారాయన. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పెట్టుబడులకు, ఉత్పాదక సామర్థ్యానికి, ఏకరూప కార్మిక విధానానికి విఘాతం కలిగించేలా ఉందని ఈ కథనంలో రాశారు. […]

ట్విట్టర్‌లో ఏపీ సీఎంవో , నీతి ఆయోగ్‌ సీఈవో మధ్య చర్చ
X

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం తెచ్చిన చట్టంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ మీడియా ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేక కథనాలు రాస్తోంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్విట్టర్లో స్పందించారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ద ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేశారాయన. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పెట్టుబడులకు, ఉత్పాదక సామర్థ్యానికి, ఏకరూప కార్మిక విధానానికి విఘాతం కలిగించేలా ఉందని ఈ కథనంలో రాశారు.

నీతి ఆయోగ్ సీఈవో ట్వీట్‌కు స్పందించిన ఏపీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ” మీరంటే చాలా గౌరవం ఉంది. పత్రిక కథనం, మీ వ్యాఖ్యలు అసమగ్ర సమాచారం ఆధారంగా చేసినట్టుగా ఉన్నాయి. ప్రభుత్వం తెచ్చిన బిల్లులో సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసే అంశాలేవీ లేవు” అని వ్యాఖ్యానించారు.

ఇందుకు తిరిగి స్పందించిన అమితాబ్ కాంత్… తాను ట్విట్టర్లో ఉంచినది తన సొంత వ్యాఖ్యలు కాదని… పత్రికల్లో వచ్చిన కథనాన్ని మాత్రమే ఉంచానని బదులిచ్చారు.

First Published:  30 July 2019 4:59 AM IST
Next Story