ప్రతి అమ్మాయికి సెకెండ్ ఛాన్స్ ఇవ్వాలి
మలైకా అరోరా.. వయసైపోతున్నా హాట్ నెస్ తగ్గని బాలీవుడ్ బ్యూటీ. కేవలం శరీరాకృతిలోనే కాదు, మాటల్లో కూడా తన హాట్ నెస్ చూపిస్తోంది ఈ వయ్యారి. ప్రతి అమ్మాయికి సెకెండ్ ఛాన్స్ ఇవ్వాలని వాదిస్తోంది. ఎందులో సెకండ్ ఛాన్స్ అని ఆలోచిస్తున్నారా? ఇక చదివేయండి. అమ్మాయిలు ప్రేమలో పడడం సహజం, పడిన తర్వాత రిలేషన్ షిప్ ను కొనసాగించడం కూడా అంతే సహజం. అయితే రిలేషన్ షిప్ లో కొంతదూరం వెళ్లిన తర్వాత అబ్బాయిలో తప్పులు అప్పుడు […]
మలైకా అరోరా.. వయసైపోతున్నా హాట్ నెస్ తగ్గని బాలీవుడ్ బ్యూటీ. కేవలం శరీరాకృతిలోనే కాదు, మాటల్లో కూడా తన హాట్ నెస్ చూపిస్తోంది ఈ వయ్యారి. ప్రతి అమ్మాయికి సెకెండ్ ఛాన్స్ ఇవ్వాలని వాదిస్తోంది. ఎందులో సెకండ్ ఛాన్స్ అని ఆలోచిస్తున్నారా? ఇక చదివేయండి.
అమ్మాయిలు ప్రేమలో పడడం సహజం, పడిన తర్వాత రిలేషన్ షిప్ ను కొనసాగించడం కూడా అంతే సహజం. అయితే రిలేషన్ షిప్ లో కొంతదూరం వెళ్లిన తర్వాత అబ్బాయిలో తప్పులు అప్పుడు కనిపిస్తాయి. కానీ అప్పటికే లవ్ అనే కమిట్ మెంట్ ఉంటుంది కాబట్టి అమ్మాయిలు వెనక్కి రాలేరు. సరిగ్గా ఇక్కడే వాళ్లకు సెకెండ్ ఛాన్స్ ఇవ్వాలంటోంది మలైకా. మరో అబ్బాయిని ప్రేమించే అవకాశం కల్పించాలంటోంది.
మలైకా ఇప్పటివరకు చెప్పింది బాగానే ఉంది. కానీ ఇప్పుడీ సెకెండ్ ఛాన్స్ కాన్సెప్ట్ ను పెళ్లికి కూడా వర్తింపజేయాలంటోంది మలైకా. సమాజం అంగీకరించకపోయినా, చట్టాలు ఒప్పుకోకపోయినా.. పెళ్లి తర్వాత కూడా అమ్మాయికి సెకెండ్ ఛాన్స్ ఇవ్వడమే కరెక్ట్ అంటోంది. అప్పుడే మహిళలను గుర్తించినట్టు అవుతుందట.
ఈమె ఇప్పుడు ఆ సెకెండ్ ఛాన్స్ నే ఎంజాయ్ చేస్తోంది. అర్బాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చేసి, 16 ఏళ్ల కొడుకును కూడా పట్టించుకోకుండా.. అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. త్వరలోనే అతడ్ని పెళ్లిచేసుకుంటాననే అర్థం వచ్చేలా మాట్లాడుతోంది. తనలాగ అందర్నీ సెకండ్ ఛాన్స్ తీసుకోమంటోంది ఈ బ్యూటీ. పిచ్చి పరాకాష్టకు చేరడం అంటే ఇదేనేమో.