దళిత ఎమ్మెల్యే దీక్ష చేసిన చోటు శుద్ధి
కేరళ లోని త్రిసూర్ జిల్లా నట్టిక నియోజకవర్గం నుంచి ఎన్నికైన సి.పి.ఐ. శాసన సభ్యురాలు గీతా గోపి రోడ్ల దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకు రావడం కోసం ప్రజా సంక్షేమ శాఖ కార్యాలయం ముందు గత శనివారం బైఠాయించారు. ఈ విషయంలో చర్య తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆమె దీక్ష విరమించారు. ఇక్కడి దాకా ఈ ఉదంతంలో విచిత్రం ఏమీ లేదు. కాని గీత దీక్ష విరమించి వెళ్లిపోయిన తర్వాత యువజన కాంగ్రెస్ నాయకులు ఆమె […]
కేరళ లోని త్రిసూర్ జిల్లా నట్టిక నియోజకవర్గం నుంచి ఎన్నికైన సి.పి.ఐ. శాసన సభ్యురాలు గీతా గోపి రోడ్ల దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకు రావడం కోసం ప్రజా సంక్షేమ శాఖ కార్యాలయం ముందు గత శనివారం బైఠాయించారు. ఈ విషయంలో చర్య తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆమె దీక్ష విరమించారు.
ఇక్కడి దాకా ఈ ఉదంతంలో విచిత్రం ఏమీ లేదు. కాని గీత దీక్ష విరమించి వెళ్లిపోయిన తర్వాత యువజన కాంగ్రెస్ నాయకులు ఆమె దీక్ష చేసిన చోటును పేడ నీళ్లు చల్లి శుద్ధి చేశారు. అక్కడ దళిత మహిళ కూర్చోవడం వల్ల ఆ ప్రాంతం అపవిత్రమైందని భావించి యువజన కాంగ్రెస్ వారు శుద్ధి చేశారు. అంతకు ముందు వారు ఆమె దీక్షకు నిరసన తెలియజేస్తూ ఊరేగింపు కూడా నిర్వహించారు.
గీత పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ప్రాథమిక దర్యాప్తు నివేదిక నమోదు చేశారు. ఎస్.సి., ఎస్.టి. ల మీద అత్యాచారాల నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదైంది.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ దృష్టికి తీసుకెళ్తానని గీత అంటున్నారు. ఇతర పార్టీల నాయకులు, మంత్రులు యువజన కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా ఖండించారు.