Telugu Global
Cinema & Entertainment

ఇస్మార్ట్ శంకర్ మార్కెట్-షేరింగ్స్ వివరాలు

రామ్, పూరి జగన్నాధ్ ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అంటే రూపాయికి రూపాయి లాభం అన్నమాట. ఈ కాలం ఇలా డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వడం సాధారణ విషయం కాదు. ఎంతో ప్లానింగ్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. రామ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని, తక్కువ బడ్జెట్ లో తీసి, అంతే తక్కువ మొత్తానికి సినిమాను అమ్మడం వల్ల రెట్టింపు లాభాలు వస్తున్నాయి. ఉదాహరణకు […]

ఇస్మార్ట్ శంకర్ మార్కెట్-షేరింగ్స్ వివరాలు
X

రామ్, పూరి జగన్నాధ్ ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అంటే రూపాయికి రూపాయి లాభం అన్నమాట. ఈ కాలం ఇలా డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వడం సాధారణ విషయం కాదు. ఎంతో ప్లానింగ్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. రామ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని, తక్కువ బడ్జెట్ లో తీసి, అంతే తక్కువ మొత్తానికి సినిమాను అమ్మడం వల్ల రెట్టింపు లాభాలు వస్తున్నాయి.

ఉదాహరణకు నైజాంనే తీసుకుందాం. నైజాంలో ఈ సినిమాను ఐదున్నర కోట్ల రేషియోలో ఇచ్చారు. కట్ చేస్తే, నిన్నటితో 12 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అంటే ఖర్చులు పోనూ.. అటుఇటుగా 6 కోట్ల రూపాయల లాభం అన్నమాట. ఇంకా మూవీ నడుస్తోంది. కనీసం మరో 2 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది.

నైజాంలోనే కాదు.. దాదాపు అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి. గుంటూరు, ఈస్ట్ లాంటి ప్రాంతాల మినహా.. మిగతా అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు డబుల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. నైజాంలో అయితే ఏకంగా ఓవర్ ఫ్లోస్ రావడం విశేషం. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్, 12 రోజుల షేర్ కంపేర్ చేసి చూద్దాం.

ప్రాంతం ప్రీ-రిలీజ్ బిజినెస్ 12 రోజుల షేర్
నైజాం రూ. 5.50 కోట్లు రూ. 12.55 కోట్లు
సీడెడ్ రూ. 2.52 కోట్లు రూ. 5 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 1.40 కోట్లు రూ. 3.48 కోట్లు
ఈస్ట్ రూ. 1.05 కోట్లు రూ. 1.83 కోట్లు
వెస్ట్ రూ. 0.90 కోట్లు రూ. 1.53 కోట్లు
గుంటూరు రూ. 1.10 కోట్లు రూ. 1.82 కోట్లు
నెల్లూరు రూ. 0.48 కోట్లు రూ. 0.96 కోట్లు
కృష్ణా రూ. 0.95 కోట్లు రూ. 1.82 కోట్లు

First Published:  30 July 2019 10:58 AM IST
Next Story