నరసింహన్ తో పవన్ మీటింగ్ వెనుక కథేంటి?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ విజయవాడకు వచ్చారు. జనసేన పార్టీ కార్యక్రమాల పేరిట హడావుడి చేస్తున్నారు. కొత్తగా పార్టీలో కమిటీలు పెట్టిన ఆయన వాటి సమావేశాలు పెట్టారు. రాజకీయంగా ఏం చేయాలి అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈ సారి పార్టీ మీటింగ్ లకు సోదరుడు నాగబాబు కూడా హాజరవుతున్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో పవన్ కల్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనను విలీనం చేయాలని కొన్ని జాతీయ పార్టీలు అడుగుతున్నాయని చెప్పుకొచ్చారు. జనసేనను […]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ విజయవాడకు వచ్చారు. జనసేన పార్టీ కార్యక్రమాల పేరిట హడావుడి చేస్తున్నారు. కొత్తగా పార్టీలో కమిటీలు పెట్టిన ఆయన వాటి సమావేశాలు పెట్టారు. రాజకీయంగా ఏం చేయాలి అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈ సారి పార్టీ మీటింగ్ లకు సోదరుడు నాగబాబు కూడా హాజరవుతున్నారు.
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో పవన్ కల్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనను విలీనం చేయాలని కొన్ని జాతీయ పార్టీలు అడుగుతున్నాయని చెప్పుకొచ్చారు. జనసేనను ఏ పార్టీలో కలిపే ప్రసక్తే లేదని పవన్ చెప్పినట్లు సమాచారం అందుతోంది. జాతీయ పార్టీలు కలిసి రావాలని కోరుతున్నాయని.. కానీ ఎవరితో నడిచినా లౌకిక పంథాని పాటిస్తా అని నేతలతో అన్నట్లు తెలుస్తోంది.
రాజకీయ ఎఫైర్స్ కమిటీ మీటింగ్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జాతీయ పార్టీలు కలిసి రావాలని కోరాయని ఆయన ఈ టైమ్ లో చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ఓ సంఘటన చూస్తే ఆయన వ్యాఖ్యల వెనుక అసలు పరమార్ధం అర్ధమవుతుంది. పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ టైమ్ లో నరసింహన్ ను పవన్ ఎందుకు కలిశారనే చర్చ మొదలైంది.
నరసింహన్ ను కలిసిన తర్వాతే పార్టీ మీటింగ్ లో విలీనం లాంటి వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే నరసింహన్… పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారని ఓ వినికిడి. అక్కడే జనసేన విలీనం లేదా కలిసి నడిచే ఫార్ములాను ముందు పెట్టినట్లు సమాచారం.
అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం చెప్పలేదని…త్వరలోనే మళ్లీ మాట్లాడుతానని చెప్పి వచ్చారట. మొత్తానికి జనసేన జాతీయ పార్టీలో త్వరలోనే కలిసిపోవడమో? లేదా అవగాహనతో ముందుకు సాగే కార్యక్రమమో? ఉంటుందని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నాటికి ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.