Telugu Global
NEWS

కాపు రిజర్వేషన్లపై కమిటీ.. జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. రిజర్వేషన్లకు సంబంధించిన సమావేశం నిర్వహించిన కాపు నేతలు.. సమావేశం తర్వాత ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. ఇది వరకే కాపు రిజర్వేషన్లపై చట్టంతోపాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులుగా మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఉన్నారు. ఈ సభ్యులు ఈ కాపు రిజర్వేషన్లపై జగన్ తో ప్రస్తావించారు. […]

కాపు రిజర్వేషన్లపై కమిటీ.. జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
X

కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. రిజర్వేషన్లకు సంబంధించిన సమావేశం నిర్వహించిన కాపు నేతలు.. సమావేశం తర్వాత ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు.

ఇది వరకే కాపు రిజర్వేషన్లపై చట్టంతోపాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులుగా మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఉన్నారు. ఈ సభ్యులు ఈ కాపు రిజర్వేషన్లపై జగన్ తో ప్రస్తావించారు. గతంలో కాపులను బీసీల్లో చేరిస్తూ చేసిన తీర్మానం అందజేశారు. కాపులకి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిన అంశాన్ని ప్రస్తావించారు.

కాపు రిజర్వేషన్లపై ఏప్రిల్ 4న కేంద్రం రాసిన లేఖపై జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజనగరం ఎమ్మెల్యే , కాపు సామాజికవర్గానికి చెందిన జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు.

జక్కంపూడి రాజాకి కాపు కోటాలో మంత్రి పదవి దక్కుతుందని వైసీపీలో మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కేబినెట్ పదవి ఆయనకు దక్కలేదు.

ఈ నేపథ్యంలో జగన్…. జక్కంపూడి రాజాకి కాపు కార్పొరేషన్ పదవిని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రిజర్వేషన్లపై కూడా జగన్ తేల్చడానికి రెడీ అయ్యారు.

First Published:  29 July 2019 3:00 PM IST
Next Story