Telugu Global
NEWS

ప్రో-కబడ్డీ లీగ్ ముంబై అంచెలో కొహ్లీ సందడి

జాతీయగీతం ఆలపించిన విరాట్ ప్రో-కబడ్డీ లీగ్ ముంబై అంచె పోటీలను..వర్లీలోని ఎన్ఎస్ సీ డోమ్ ఇండోర్ స్టేడియంలో…భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రారంభించాడు. జాతీయగీతాన్ని కొహ్లీ ఆలపించడంతో…కబడ్డీ లీగ్ ఏడోసీజన్ ముంబై అంచె పోటీలకు తెరలేచింది. మరాఠా జట్లు యూ-ముంబా, పూణేరీ పల్టాన్ ల మధ్య ప్రారంభమ్యాచ్ ను కొహ్లీ తిలకించాడు. భారత జట్టులోని ఏడుగురు క్రికెటర్లకు..ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్ ఆడే సత్తా, సామర్థ్యం ఉన్నాయని..తాను కబడ్డీకి సరిపడిన ఆటగాడిని ఏమాత్రం కాదని కొహ్లీ తేల్చి చెప్పాడు. కబడ్డీ […]

ప్రో-కబడ్డీ లీగ్ ముంబై అంచెలో కొహ్లీ సందడి
X
  • జాతీయగీతం ఆలపించిన విరాట్

ప్రో-కబడ్డీ లీగ్ ముంబై అంచె పోటీలను..వర్లీలోని ఎన్ఎస్ సీ డోమ్ ఇండోర్ స్టేడియంలో…భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రారంభించాడు.

జాతీయగీతాన్ని కొహ్లీ ఆలపించడంతో…కబడ్డీ లీగ్ ఏడోసీజన్ ముంబై అంచె పోటీలకు తెరలేచింది. మరాఠా జట్లు యూ-ముంబా, పూణేరీ పల్టాన్ ల మధ్య ప్రారంభమ్యాచ్ ను కొహ్లీ తిలకించాడు.

భారత జట్టులోని ఏడుగురు క్రికెటర్లకు..ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్ ఆడే సత్తా, సామర్థ్యం ఉన్నాయని..తాను కబడ్డీకి సరిపడిన ఆటగాడిని ఏమాత్రం కాదని కొహ్లీ తేల్చి చెప్పాడు.

కబడ్డీ ఆడటానికి తగిన దమ్మున్న భారత క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, ఉమేశ్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, రాహుల్ ఉన్నారని …కెప్టెన్ కొహ్లీ అభిప్రాయపడ్డాడు.

తాను బాల్యం నుంచి కబడ్డీ ఆడుతూ స్ఫూర్తి పొందానని కొహ్లీ గుర్తు చేసుకొన్నాడు. రఫ్ అండ్ టఫ్ గా ఉండే కబడ్డీ ఆడాలంటే… కండబలం, గుండెబలం..వీటిని మించి దమ్ము, టాప్ క్లాస్ ఫిట్ నెస్ అవసరమని కొహ్లీ చెప్పాడు.

మొత్తం మీద..స్టార్ స్పోర్ట్స్‌ లాభసాటి వ్యాపారంగా మారిన ప్రీమియర్ కబడ్డీలీగ్ ప్రచారం కోసం…భారత స్టార్ క్రికెటర్లు సైతం తలో చేయి వేస్తున్నారు.

First Published:  28 July 2019 8:57 PM GMT
Next Story