Telugu Global
Cinema & Entertainment

కెజిఫ్ లో అధీరా గా సంజయ్ దత్

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ‘కే జి ఎఫ్ చాప్టర్ 1’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. కేవలం కన్నడలో మాత్రమే కాక దేశ వ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం అందరి కళ్ళు ‘కే జి ఎఫ్: చాప్టర్ 2’ పైనే ఉన్నాయి. ఈ మధ్యనే ఈ చిత్ర […]

కెజిఫ్ లో అధీరా గా సంజయ్ దత్
X

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ‘కే జి ఎఫ్ చాప్టర్ 1’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. కేవలం కన్నడలో మాత్రమే కాక దేశ వ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం అందరి కళ్ళు ‘కే జి ఎఫ్: చాప్టర్ 2’ పైనే ఉన్నాయి. ఈ మధ్యనే ఈ చిత్ర షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళింది.

తాజాగా చిత్ర బృందం నుంచి ‘అధీర’ అనే పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలయింది. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడని, ఆ పాత్ర సినిమాకి కీలకం కాబోతోందని అంటున్నారు.

ఈ పోస్టర్ లో సంజయ్ దత్ ఉగ్రరూపంతో సరి కొత్త లుక్ తో కనిపిస్తున్నారు.

సంజయ్ దత్ నటన వల్ల ఈ సినిమాకి మరింత బలం చేకూరుతుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హోంబల్ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రవి బసృర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

First Published:  29 July 2019 6:00 AM IST
Next Story