Telugu Global
NEWS

ఫేస్‌బుక్‌కు తెలుగు త‌మ్ముళ్ల గుడ్ బై !

టీడీపీ సోష‌ల్ మీడియా ఇంచార్జ్‌గా నారా లోకేష్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ హ‌డావుడి మొదలైంది. చిన‌బాబు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్ట‌ర్ రాయుడిగా మారిపోయారు. ఆ ట్వీట్ల ద్వారా ఎంత మైలేజీ వ‌స్తుందో లేదో కానీ…రోజూ మాత్రం ట్వీట్లు చేస్తున్నారు. ఇటు ఇత‌ర టీడీపీ నేత‌లు కూడా ట్వీట్ల ప్ర‌యోగం మొద‌లుపెట్టారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వీరంతా ఇప్పుడు ట్విట్ట‌ర్ మీద ప‌డ్డారు. ఎన్నిక‌ల ముందు ఫేస్‌బుక్‌లో టీడీపీ సోష‌ల్ మీడియా తెగ […]

ఫేస్‌బుక్‌కు తెలుగు త‌మ్ముళ్ల గుడ్ బై !
X

టీడీపీ సోష‌ల్ మీడియా ఇంచార్జ్‌గా నారా లోకేష్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ హ‌డావుడి మొదలైంది. చిన‌బాబు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్ట‌ర్ రాయుడిగా మారిపోయారు. ఆ ట్వీట్ల ద్వారా ఎంత మైలేజీ వ‌స్తుందో లేదో కానీ…రోజూ మాత్రం ట్వీట్లు చేస్తున్నారు.

ఇటు ఇత‌ర టీడీపీ నేత‌లు కూడా ట్వీట్ల ప్ర‌యోగం మొద‌లుపెట్టారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వీరంతా ఇప్పుడు ట్విట్ట‌ర్ మీద ప‌డ్డారు. ఎన్నిక‌ల ముందు ఫేస్‌బుక్‌లో టీడీపీ సోష‌ల్ మీడియా తెగ పోస్టులు పెట్టేది. ర‌క‌ర‌కాల క్యాంపెన్‌లు న‌డిపేది. కానీ సోష‌ల్ మీడియా విభాగంలో ఉన్న వ్య‌క్తుల మ‌ధ్య విభేదాల‌తో అది కాస్తా ఫెయిల్ అయింది. ఒక్క‌రికే పేరు వ‌స్తుంద‌ని మ‌రొక బ్యాచ్ సైలెంట్ అయింది. దీంతో టీడీపీ సోష‌ల్ మీడియా ప్ర‌చారంలో వెనుక‌బ‌డింది. ఎన్నిక‌ల్లో చావు దెబ్బ‌తింది.

ప్ర‌తిప‌క్షంగా వైసీపీ సోష‌ల్ మీడియా మీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినా…. ఎవరికి వాళ్ళే వైఎస్ అభిమానులు విజృంభించి పనిచేశారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో సుక్షితులైన పార్టీ కార్య‌క‌ర్త‌లు ఫేస్‌బుక్‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప్ర‌చారం హోరెత్తించారు. ఒకానొక స‌మ‌యంలో వీరి ప్ర‌చారంతో టీడీపీ కార్య‌ర్త‌లు చేతులెత్తేశారు. స‌మాధానం చెప్పుకోలేక ఫేస్‌బుక్‌కు కొన్నిరోజులు దూరంగా ఉన్నారు.

అయితే తాజాగా టీడీపీ సోష‌ల్ మీడియాలో ఓ నిర్ణ‌యం జ‌రిగింది. ఫేస్‌బుక్‌ను వ‌దిలేసి యాక్టివ్ కార్య‌క‌ర్త‌ల‌ను ట్విట్ట‌ర్ అకౌంట్లు తెర‌వాల‌ని మేసేజ్‌లు వెళ్లాయి. దీంతో కొంత‌మంది ట్విట్ట‌ర్ అకౌంట్లు తెరిచారు. అయితే మ‌రికొంత మంది ట్విట్ట‌ర్ హ్యాండిల్ చేయ‌లేక అకౌంట్లు తెర‌వ‌లేక‌పోయారు.

ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్లు పెరిగిపోయాయి. దీంతో ఎవ‌రైనా విప‌రీత‌మైన కామెంట్లు చేస్తే ఇత‌రులు ప్రొపైల్ రిపోర్టుపై ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో అకౌంట్ మూత‌ప‌డిపోతోంది. తిరిగి అకౌంట్ ఆప‌రేట్ చేయాలంటే ఫేస్‌బుక్ నుంచి వ‌చ్చే వ్య‌క్తి స్వ‌యంగా వ‌చ్చి అకౌంట్ ఆ వ్య‌క్తిదేన‌ని నిరూపించుకోవాలి. దీంతో ఫేక్ అకౌంట్లతో ప్ర‌చారానికి తెర‌ప‌డింది. టీడీపీ సోష‌ల్ మీడియాలో ఉండే చాలా మందివి ఫేక్ అకౌంట్లే. దీంతో ఫేస్‌బుక్‌లో త‌మ ప్ర‌చారం న‌డ‌వ‌డం లేద‌ని ట్విట్ట‌ర్ బాట ప‌ట్టార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ట్విట్టర్ ప్ర‌చారంలో కూడా టీడీపీ వెనుక‌ప‌డింది. లోకేష్ ట్వీట్ల‌కు రెస్పాన్స్ రావ‌డం లేదు. దీంతో త‌మ్ముళ్ల‌కు అకౌంట్లు తెరిపించి లైకులు కొట్టించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. మొత్తానికి ట్విట్ట‌ర్ వాడే త‌మ్ముళ్లు త‌క్కువ‌గా ఉండ‌డంతో ఏం చేయాలో తెలియ‌క సోష‌ల్ మీడియా ఇంచార్జ్‌లు కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

First Published:  29 July 2019 3:05 AM IST
Next Story