Telugu Global
National

కర్నాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

కర్నాటక స్పీకర్ రమేష్‌ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా రెబల్ ఎమ్మెల్యేలకు భారీ షాక్ ఇచ్చారు. మొత్తం 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఒక్కొక్కరు నాలుగేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ వేటు ఉంటుందని స్పీకర్ ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్‌- జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయి… యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్పీకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రాజీనామాలను ఆమోదించకుండా […]

కర్నాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం
X

కర్నాటక స్పీకర్ రమేష్‌ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా రెబల్ ఎమ్మెల్యేలకు భారీ షాక్ ఇచ్చారు. మొత్తం 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఒక్కొక్కరు నాలుగేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ వేటు ఉంటుందని స్పీకర్ ప్రకటించడం గమనార్హం.

కాంగ్రెస్‌- జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయి… యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్పీకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రాజీనామాలను ఆమోదించకుండా ఎక్కువగా కాలం పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు అనర్హత వేటు వేయడం సరికాదని సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అనర్హత వేటుకు గురైన వారిలో 11 మంది కాంగ్రెస్‌ వారు, ముగ్గురు జేడీఎస్ సభ్యులు ఉన్నారు.

వీరంతా బలపరీక్ష సందర్భంగా విప్‌ ధిక్కరించారన్న ఆరోపణలతో స్పీకర్ వేటు వేశారు. ఇది వరకే ముగ్గురిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఇప్పుడు మరో 14 మందిపై వేటు వేయడంతో మొత్తం 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినట్టు అయింది.

అయితే ఒక్కో ఎమ్మెల్యే నాలుగేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయడం ఎంత వరకు నిలబడుతుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

First Published:  28 July 2019 7:31 AM IST
Next Story