Telugu Global
NEWS

జైపాల్‌రెడ్డి.... జీవితమే ఒక సిద్దాంతం

సూదిని జైపాల్‌రెడ్డి.. తెలంగాణలోని వెనుకబడిన పాలమూరు జిల్లాలో పుట్టి ఢిల్లీ వరకు వెళ్లిన రాజకీయ నాయకుడు. తాను కట్టుబడిన సిద్దాంతం కోసం ఏనాడూ వెనకడగు వేయలేదు. ఆనాడు ఇందిరాను ఎదిరించినా…. తర్వాత సోనియాను తెలంగాణకు ఒప్పించినా అంతా జైపాల్ రాజకీయ చాతుర్యమే. తెలంగాణలో పుట్టిన జైపాల్ రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయంగా చాలా చురుకుగా ఉండేవారు. పోలియో వల్ల తన శరీరం బలహీనపడినా.. తన గుండె ధైర్యం మాత్రం ఏనాడూ సన్నగిల్లలేదు. మొదట్లో కాంగ్రెస్‌లో కీలక […]

జైపాల్‌రెడ్డి.... జీవితమే ఒక సిద్దాంతం
X

సూదిని జైపాల్‌రెడ్డి.. తెలంగాణలోని వెనుకబడిన పాలమూరు జిల్లాలో పుట్టి ఢిల్లీ వరకు వెళ్లిన రాజకీయ నాయకుడు. తాను కట్టుబడిన సిద్దాంతం కోసం ఏనాడూ వెనకడగు వేయలేదు. ఆనాడు ఇందిరాను ఎదిరించినా…. తర్వాత సోనియాను తెలంగాణకు ఒప్పించినా అంతా జైపాల్ రాజకీయ చాతుర్యమే.

తెలంగాణలో పుట్టిన జైపాల్ రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయంగా చాలా చురుకుగా ఉండేవారు. పోలియో వల్ల తన శరీరం బలహీనపడినా.. తన గుండె ధైర్యం మాత్రం ఏనాడూ సన్నగిల్లలేదు. మొదట్లో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. అయితే ఆనాడు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ అమలు చేయడంతో ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించి జనతాపార్టీలో చేరారు. ఆ పార్టీలో కూడా ప్రధాన కార్యదర్శిగా కీలకంగా పనిచేశారు.

1999లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు సోనియా గాంధీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. కీలకమైన సమాచార, చమురు శాఖలను ఆయనకే అప్పగించారు.

అంబానీకే చుక్కలు చూపించాడు

ఈ దేశాన్ని ఏ పార్టీ పరిపాలించినా అంబానీ, అదానీల మాటలకు తలొగ్గాల్సిందే అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నెంబర్ వన్ ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ మాట ఏ ప్రభుత్వంలో అయినా చెల్లుతుంది. కేజీ బేసిన్ నుంచి అక్రమంగా గ్యాస్ తరలించుకొని పోతున్నారని తొలుత గుర్తించింది జైపాల్‌రెడ్డే. ఓఎన్జీసీకి కేటాయించిన గనుల నుంచి రిలయన్స్ గ్యాస్ దొంగతనం చేయడం.. అంతే కాకుండా తమ గ్యాస్ క్షేత్రాల్లో నిల్వలు అయిపోయాయని చెప్పి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం వంటి అక్రమాలను జైపాల్ రెడ్డి గుర్తించారు.

కాగ్ కూడా రిలయన్స్ చేసిన అక్రమాలను జైపాల్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే వెల్లడించింది. దీంతో జైపాల్‌ రెడ్డి రిలయన్స్‌ కు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. దాంతో సోనియా ఆగ్రహానికి గురై చమురు శాఖ నుంచి అప్రధాన్య శాఖలకు వెళ్లిపోయారు. నేను మంత్రి పదవే పోతుందని అనుకున్నాను కానీ వేరే శాఖకు మార్చారని జైపాల్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.

సమైఖ్యవాది నుంచి తెలంగాణ వాదిగా..

జైపాల్ రెడ్డి తొలుత సమైక్యవాదిగా ఉండేవారు. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని ప్రత్యేక రాష్ట్రం కావల్సిందేననే నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని సోనియా మనసును మార్చింది జైపాల్ రెడ్డేనని అందరూ చెబుతారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంటులో లాబీయింగు చేసిన వారిలో జైపాల్‌రెడ్డి ముఖ్యులు. అలా తెలంగాణ కోసం పాటుపడిన కాంగ్రెస్ నేత.. చివరకు తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోనికి రాక ముందే చనిపోవడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  28 July 2019 5:46 AM IST
Next Story