జగన్ పీఏ పేరుతో బెదిరించిన నలుగురు అరెస్ట్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు కేఎన్నార్… వాడే సెల్‌ఫోన్ నెంబర్‌ను స్పూఫింగ్ చేసి పలువురు నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాగా ఏర్పడిన పండరి విష్ణుమూర్తి, గంగవరపు అరుణ్ కుమార్, పిల్ల రామకృష్ణ, మార్తాండం జగదీష్‌లు స్పూఫింగ్ పరిజ్ఞానంతో పలువురికి ఫోన్లు చేసి బెదిరించారు. కొందరి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఇదంతా 2018లో జరిగింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ అప్పట్లో […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు కేఎన్నార్… వాడే సెల్‌ఫోన్ నెంబర్‌ను స్పూఫింగ్ చేసి పలువురు నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముఠాగా ఏర్పడిన పండరి విష్ణుమూర్తి, గంగవరపు అరుణ్ కుమార్, పిల్ల రామకృష్ణ, మార్తాండం జగదీష్‌లు స్పూఫింగ్ పరిజ్ఞానంతో పలువురికి ఫోన్లు చేసి బెదిరించారు. కొందరి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఇదంతా 2018లో జరిగింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ అప్పట్లో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎట్టకేలకు ఈ ముఠా సభ్యులను ఏపీ పోలీసులు ముమ్మడివరంలో అరెస్ట్ చేశారు. నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా…. న్యాయస్థానం ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
కేసు హైదరాబాద్‌లో నమోదు అయిన నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం ఆ నలుగురిని పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకెళ్లారు.. న్యాయస్థానంలో హాజరు పరిచి న్యాయమూర్తి ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండుకు తెలంగాణ పోలీసులు తరలించారు.