Telugu Global
International

బాబు దావోస్‌ బిల్లు చెల్లించాలంటూ సీఐఐ లేఖ

చంద్రబాబు దుబారాలో ఇది మరో కోణం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏటా దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు చంద్రబాబు వెళ్లే వారు. తనను ఆర్థిక సదస్సు నిర్వాహకులే ఆహ్వానించారు… వారి ఆహ్వానం మేరకు తాను దావోస్ వెళ్తున్నట్టు చంద్రబాబు చెప్పేవారు. కానీ అది నిజం కాదని తేలింది. ఏపీ ప్రభుత్వానికి చెందిన కోట్ల రూపాయలు చెల్లించి చంద్రబాబు అక్కడికి వెళ్లేవారని స్పష్టమైంది. 2019 జనవరిలో ఆంధ్రప్రదేశ్ బృందం చేసిన దావోస్ పర్యటనకు సంబంధించిన బిల్లు 14. […]

బాబు దావోస్‌ బిల్లు చెల్లించాలంటూ సీఐఐ లేఖ
X

చంద్రబాబు దుబారాలో ఇది మరో కోణం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏటా దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు చంద్రబాబు వెళ్లే వారు. తనను ఆర్థిక సదస్సు నిర్వాహకులే ఆహ్వానించారు… వారి ఆహ్వానం మేరకు తాను దావోస్ వెళ్తున్నట్టు చంద్రబాబు చెప్పేవారు. కానీ అది నిజం కాదని తేలింది. ఏపీ ప్రభుత్వానికి చెందిన కోట్ల రూపాయలు చెల్లించి చంద్రబాబు అక్కడికి వెళ్లేవారని స్పష్టమైంది. 2019 జనవరిలో ఆంధ్రప్రదేశ్ బృందం చేసిన దావోస్ పర్యటనకు సంబంధించిన బిల్లు 14. 41 కోట్లు వచ్చింది.

సీఐఐ ద్వారా నాటి ఏపీ బృందం దావోస్‌లో కోట్లు పెట్టి లాంజ్‌ను అద్దెకు తీసుకుంది. ఇందుకు సంబంధించిన డబ్బు చెల్లించాల్సిందిగా సీఐఐ నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ వచ్చింది. 2019లో ఏపీ బృందం జరిపిన దావోస్ పర్యటన సందర్భంగా అయిన ఖర్చు 14. 41 కోట్లు అని, దాన్ని చెల్లించాలని సీఐఐ కోరింది. జీఎస్టీతో కలిపితే ఈ బిల్లు 17 కోట్లు అని అధికారులు చెబుతున్నారు.

2019లో ఏపీ బృందం దావోస్‌లో తీసుకున్న లాంజ్ అద్దె రూ. 2 కోట్ల 48 లక్షలుగా చూపారు. ఆ లాంజ్ లో కంప్యూటర్లు, సోపాలు ఏర్పాటు చేసేందుకు మరో 2. 51 కోట్లను బిల్లు వేశారు. ఏపీ బృందం నాలుగు రోజుల భోజనాల ఖర్చు కోటి ఐదు లక్షలు. ఆశ్చర్యంగా ఈ లాంజ్‌లో ఒక ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటుకు ఏకంగా కోటి 45 లక్షల బిల్లు చేశారు. ఇలా రకరకాల ఖర్చుల కింద మొత్తం బిల్లు 14 కోట్ల 41 లక్షలుగా ఉంది.

ఇప్పుడు ఈ మొత్తం ఖర్చును చెల్లించాల్సిందిగా సీఐఐ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2018లో చంద్రబాబు స్వయంగా దావోస్ వెళ్లినప్పుడు అయిన బిల్లు 9. 86 కోట్లు. చంద్రబాబు బృందం వెళ్లిన ప్రత్యేక విమానాలు, వారు బస చేసిన హోటళ్ల ఖర్చు అదనం.

First Published:  28 July 2019 1:21 AM GMT
Next Story