ముఖంపై పోలీసు బూటు కాలు ముద్ర
అనంతపురం జిల్లా పుట్లూరు పోలీసుల తీరు వివాదాస్పదమైంది. నిందితుడిని పరామర్శించేందుకు వచ్చిన ఒక యువకుడి ముఖంపై పోలీసులు పదేపదే బూటు కాళ్లతో తన్నారు. దాంతో ఆ యువకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పుట్లూరు మండలం అరకటివేములకు చెందిన ఒక కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వారిని చూసేందుకు అదే గ్రామానికి చెందిన నాగముని స్టేషన్‌కు వచ్చాడు. పోలీసుల ఇగోపై పెద్దగా అవగాహన లేని నాగముని నిందితుడిని కిటికీలో నుంచి చూసేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆగ్రహించిన […]
అనంతపురం జిల్లా పుట్లూరు పోలీసుల తీరు వివాదాస్పదమైంది. నిందితుడిని పరామర్శించేందుకు వచ్చిన ఒక యువకుడి ముఖంపై పోలీసులు పదేపదే బూటు కాళ్లతో తన్నారు. దాంతో ఆ యువకుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
పుట్లూరు మండలం అరకటివేములకు చెందిన ఒక కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వారిని చూసేందుకు అదే గ్రామానికి చెందిన నాగముని స్టేషన్‌కు వచ్చాడు. పోలీసుల ఇగోపై పెద్దగా అవగాహన లేని నాగముని నిందితుడిని కిటికీలో నుంచి చూసేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆగ్రహించిన పోలీసులు అతడిని లోపలికి పిలిచి కిటికీలో నుంచి ఏం చూస్తున్నావంటూ దాడికి దిగారు.
కూర్చోబెట్టి ముఖం మీద బూటు కాళ్లలో పదేపదే తన్నారు. దాంతో కన్నీటి పర్యంతమైన నాగముని స్థానిక మీడియా ప్రతినిధులకు తన ముఖంపై పడ్డ పోలీసుల బూటు కాలు ముద్రలను చూపించి ఆవేదన చెందాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తాడిపత్రి డీఎస్పీ … పుట్లూరు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.