ఈ లెక్క నిజమైతే టీఆర్ఎస్ దేశంలోనే టాప్
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డులు సృష్టిస్తోంది. నిజంగా ఈ లెక్కలు కనుక నిజం అయితే దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ రికార్డులు సృష్టించినట్టే. ప్రస్తుతం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభమైనప్పటి నుంచి 60 లక్షలకు పైగా ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం 40 లక్షలకు పైగా సభ్యత్వాల డేటా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా.. 20 లక్షలకు పైగా సభ్యుల డేటా డిజిటలైజేషన్ పూర్తయ్యింది. మొత్తం […]
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డులు సృష్టిస్తోంది. నిజంగా ఈ లెక్కలు కనుక నిజం అయితే దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ రికార్డులు సృష్టించినట్టే.
ప్రస్తుతం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభమైనప్పటి నుంచి 60 లక్షలకు పైగా ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం 40 లక్షలకు పైగా సభ్యత్వాల డేటా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా.. 20 లక్షలకు పైగా సభ్యుల డేటా డిజిటలైజేషన్ పూర్తయ్యింది.
మొత్తం సభ్యత్వాలు ఆన్ లైన్ చేసిన తర్వాత అసలు లెక్క తేలుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి , ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే టీఆర్ఎస్ సభ్యత్వ రుసుం ద్వారానే 15 కోట్లు వసూలు అయ్యాయని.. ఇది పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను సూచిస్తోందని తెలిపారు.
టీఆర్ఎస్ చెబుతున్న లెక్క ప్రకారం 60 లక్షల సభ్యత్వాలంటే మాటలు కాదు.. తెలంగాణలోని మొత్తం ఓటర్లు 2.95 కోట్లు. ఇందులో 60లక్షల మంది కనీసం ఒక్కొక్కరు నలుగురు ఓటర్లను ప్రభావితం చేస్తే 2.40 కోట్ల ఓట్లు వస్తాయి.
టీఆర్ఎస్ సభ్యత్వంలో రికార్డులు బద్దలు కొడుతోంది. 20కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50వేల సభ్యత్వాలు సాధించింది. ఇక మరో 10 అసెంబ్లీ సెగ్‌మెంట్ లలో 60వేల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. గజ్వేల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో అయితే 70వేల మందికి పైగా సభ్యత్వాలు నమోదై రికార్డులు సృష్టించింది.
పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. కేసీఆర్ పాలనకే జైకొట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ సభ్యత్వాలు కనుక నిజమైతే తెలంగాణలో ఆ పార్టీకి గట్టి పట్టు చిక్కినట్టే లెక్క.