దేశంలో మూకదాడులపై సుప్రీం ఆందోళన
భారతదేశంలో ఇటీవల రోజురోజుకు పెరిగిపోతున్న మూక దాడులపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భిన్నత్వంలో ఏకత్వంతో విరాజిల్లిన భారతదేశంలో సహనం అనేది లేకుండా పోయిందా? అన్న అనుమానం కలుగుతోందని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూకదాడుల నివారణకు గతేడాది తామిచ్చిన మార్గదర్శకాలను ఎలా అమలు చేశారో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు, 10 రాష్ట్రాలను, జాతీయ మానవహక్కుల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. మూకదాడులను తీవ్రమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గతేడాది […]
భారతదేశంలో ఇటీవల రోజురోజుకు పెరిగిపోతున్న మూక దాడులపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భిన్నత్వంలో ఏకత్వంతో విరాజిల్లిన భారతదేశంలో సహనం అనేది లేకుండా పోయిందా? అన్న అనుమానం కలుగుతోందని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మూకదాడుల నివారణకు గతేడాది తామిచ్చిన మార్గదర్శకాలను ఎలా అమలు చేశారో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు, 10 రాష్ట్రాలను, జాతీయ మానవహక్కుల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. మూకదాడులను తీవ్రమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్లో మూకదాడుల కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పాటు, విచారణపూర్తికి కాలపరిమితి వంటి మార్గదర్శకాలున్నాయి. అయితే వాటిని ప్రభుత్వాలు అమలు చేస్తున్న జాడలు కనిపించడం లేదు. దాంతో దేశంలో మూకదాడులు పెరుగుతున్నాయి. మతం పేరుతో కొన్నిచోట్ల… ఆధిపత్య వర్గాల వల్ల మరికొన్ని చోట్ల మూకదాడులు జరుగుతున్నాయి.