చిరు ఉద్యోగి వద్ద వేల కోట్లా? ఈడీ విచారణ
మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో సాన సతీష్ బాబును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారులు, రాజకీయ ప్రముఖులకు సతీష్ బాబు బినామీగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మొయిన్ ఖురేషీ కేసులో సతీష్ నిందితుడుగా ఉన్నాడు. ఇతడి స్వస్థలం కాకినాడ. ఆ మధ్య సీబీఐలో ఉన్నతాధికారులు ఇద్దరి మధ్య జరిగిన గొడవలో సతీష్ పాత్ర వెలుగులోకి వచ్చింది. సీబీఐ ఉన్నతాధికారికి సతీష్ లంచం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. సతీష్ కారణంగానే సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ బదిలీలకు […]
మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో సాన సతీష్ బాబును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారులు, రాజకీయ ప్రముఖులకు సతీష్ బాబు బినామీగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మొయిన్ ఖురేషీ కేసులో సతీష్ నిందితుడుగా ఉన్నాడు. ఇతడి స్వస్థలం కాకినాడ. ఆ మధ్య సీబీఐలో ఉన్నతాధికారులు ఇద్దరి మధ్య జరిగిన గొడవలో సతీష్ పాత్ర వెలుగులోకి వచ్చింది. సీబీఐ ఉన్నతాధికారికి సతీష్ లంచం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.
సతీష్ కారణంగానే సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ బదిలీలకు గురయ్యారు. విద్యుత్ శాఖలో చిన్న ఉద్యోగిగా చేరిన సతీష్ వద్ద వేల కోట్ల ఆస్తులున్నట్టుగా ఈడీ గుర్తించింది. రాజకీయనాయకులకు బినామీగా ఉండడం వల్లే ఇన్ని ఆస్తులు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సీఎం రమేష్‌తో సతీష్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.
ఈ నేపథ్యంలో సతీష్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అతడికి వేల కోట్లు ఎలా వచ్చాయన్న దానిపై ఆరా తీస్తోంది.