2020 ఖేలో ఇండియా గేమ్స్ వేదిక అసోం
జనవరి 18 నుంచి 30 వరకూ సమరం భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తృతీయ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు.. అసోం ఆతిథ్యమిస్తుందని… కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ ప్రకటించారు. 2020 ఖేలో ఇండియా క్రీడోత్సవాలు జనవరి 18 నుంచి 30 వరకూ గౌహతీ వేదికగా జరుగుతాయని…మొత్తం 10 వేలమంది యువ క్రీడాకారులు వివిధ అంశాలలో పోటీపడతారని తెలిపారు. 17 సంవత్సరాల లోపు బాలబాలికలు, 21 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఈ పోటీలలో పాల్గొనటానికి అర్హులని ప్రకటించారు. […]

- జనవరి 18 నుంచి 30 వరకూ సమరం
భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తృతీయ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు.. అసోం ఆతిథ్యమిస్తుందని… కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ ప్రకటించారు.
2020 ఖేలో ఇండియా క్రీడోత్సవాలు జనవరి 18 నుంచి 30 వరకూ గౌహతీ వేదికగా జరుగుతాయని…మొత్తం 10 వేలమంది యువ క్రీడాకారులు వివిధ అంశాలలో పోటీపడతారని తెలిపారు.
17 సంవత్సరాల లోపు బాలబాలికలు, 21 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఈ పోటీలలో పాల్గొనటానికి అర్హులని ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కలల పథకంగా ఖేలో ఇండియా క్రీడల్ని గతంలో న్యూఢిల్లీ, పూణే నగరాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే.