ట్రైలర్ టాక్: జాక్ పాట్
జ్యోతిక… అటు తమిళ్ లో ఇటు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ తమిళం లో నే ఆమె కి మంచి మార్కెట్ ఉంది. సూర్య ని వివాహం చేసుకున్నాక దాదాపుగా సినిమాలకి దూరం అయిన జ్యోతిక 36 వాయుథినిలే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తమిళం లో వరుసగా సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే జ్యోతిక నటించిన కొత్త చిత్రం జాక్ పాట్ త్వరలో […]

జ్యోతిక… అటు తమిళ్ లో ఇటు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ తమిళం లో నే ఆమె కి మంచి మార్కెట్ ఉంది.
సూర్య ని వివాహం చేసుకున్నాక దాదాపుగా సినిమాలకి దూరం అయిన జ్యోతిక 36 వాయుథినిలే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తమిళం లో వరుసగా సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే జ్యోతిక నటించిన కొత్త చిత్రం జాక్ పాట్ త్వరలో తెలుగు లో కూడా విడుదల కానుంది.
ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని ఇప్పటికే తమిళం లో విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా ని తెలుగు లో కూడా డబ్ చేసి తమిళం తో పాటు తెలుగు లో కూడా వచ్చే నెల 2 న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలనేది చిత్ర యూనిట్ ప్లాన్.
అందుకే ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ లో జ్యోతిక మరో హీరోయిన్ రేవతి తో కలిసి కనిపించనుంది.
ఈ ట్రైలర్ కామెడీ అంశాల తో మిళితమై అన్ని వర్గాల ప్రేక్షకుల ని అలరించే విధంగా ఉంది. కళ్యాణ్ ఈ సినిమా కి దర్శకుడు. ఈ సినిమా లో యోగి బాబు, మొట్ట రాజేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, ఆనంద్ రాజ్ కూడా నటించారు. హీరో సూర్య ఈ సినిమా కి నిర్మాత.
Here comes the entertaining #JackpotTeluguTrailer starring the powerhouse #Jyotika and #Revathi ???
Click to play now ➡️ https://t.co/8Dti6npiQN#Kalyaan @2D_ENTPVTLTD @Suriya_offl @rajsekarpandian @Composer_Vishal pic.twitter.com/jPIASa2992
— Sony Music South (@SonyMusicSouth) July 27, 2019