వైద్యం కోసం అమెరికాకు చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 28న అమెరికా వెళ్తున్నారు. ఇందుకోసం శుక్రవారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు బాబు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్తారు. చంద్రబాబు వైద్య పరీక్షల కోసమే అమెరికా వెళ్తున్నట్టు పార్టీ వెల్లడించింది. చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు తనకున్న ఆరోగ్య సమస్యలకు ట్రీట్‌మెంట్ కూడా తీసుకోనున్నారు. గతంలో కూడా చంద్రబాబు ఇదే తరహాలో అమెరికా వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు ఆరోగ్య పరీక్షలకు వెళ్లారని ప్రచారం జరిగినా ఆ […]

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 28న అమెరికా వెళ్తున్నారు. ఇందుకోసం శుక్రవారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు బాబు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్తారు. చంద్రబాబు వైద్య పరీక్షల కోసమే అమెరికా వెళ్తున్నట్టు పార్టీ వెల్లడించింది.
చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు తనకున్న ఆరోగ్య సమస్యలకు ట్రీట్‌మెంట్ కూడా తీసుకోనున్నారు. గతంలో కూడా చంద్రబాబు ఇదే తరహాలో అమెరికా వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు ఆరోగ్య పరీక్షలకు వెళ్లారని ప్రచారం జరిగినా ఆ విషయాన్ని పార్టీ ఎక్కడా ధృవీకరించలేదు. ఈసారి మాత్రం చంద్రబాబు ఆరోగ్య పరీక్షల కోసమే అమెరికా వెళ్తున్నట్టు టీడీపీ నేతలు వెల్లడించారు.