విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు లేనట్టే...
విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను కేంద్ర విమానయాన శాఖ తోసి పుచ్చింది. ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పుపై ఇంకా పాలసీ సిద్ధం కానందున ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు కేంద్ర విమానయాన శాఖ స్పష్టం చేసింది. 2017లో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు, తిరుపతి ఎయిర్‌పోర్టుకు వేంకటేశ్వర స్వామి పేరును పెట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎయిర్ పోర్టుకు పేరు మార్చలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశంపై […]

విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను కేంద్ర విమానయాన శాఖ తోసి పుచ్చింది. ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పుపై ఇంకా పాలసీ సిద్ధం కానందున ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు కేంద్ర విమానయాన శాఖ స్పష్టం చేసింది.
2017లో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు, తిరుపతి ఎయిర్‌పోర్టుకు వేంకటేశ్వర స్వామి పేరును పెట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎయిర్ పోర్టుకు పేరు మార్చలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఏపీ కొత్త ప్రభుత్వ అభిప్రాయం ఏమిటన్నది కూడా తెలుసుకుంటామని విమానయాన శాఖ వెల్లడించింది.