Telugu Global
NEWS

జీతాలు ఎగ్గొట్టిన కేశినేని... సంకనాకిపోతావ్ అన్న పీవీపీ

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇటీవల ట్విట్టర్లో చంద్రబాబు నుంచి జగన్‌ మోహన్ రెడ్డి వరకు అందరికీ నీతులు చెబుతున్నాడు. అలా చేస్తే బాగుంటుంది… ఇలా చేస్తే బాగుంటుంది… అంటూ సూచనలు ఇస్తున్నాడు. అయితే తన వద్ద పనిచేసిన కార్మికులకు జీతాలు చెల్లించే విషయం మాత్రం మరిచిపోయాడు కేశినేని నాని. దాంతో జీతాల కోసం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కేశినేని నాని ట్రావెల్స్‌ బాధిత కార్మికులు దీక్షకు దిగారు. కసాయి వాడికి గొర్రె మీద […]

జీతాలు ఎగ్గొట్టిన కేశినేని... సంకనాకిపోతావ్ అన్న పీవీపీ
X

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇటీవల ట్విట్టర్లో చంద్రబాబు నుంచి జగన్‌ మోహన్ రెడ్డి వరకు అందరికీ నీతులు చెబుతున్నాడు. అలా చేస్తే బాగుంటుంది… ఇలా చేస్తే బాగుంటుంది… అంటూ సూచనలు ఇస్తున్నాడు.

అయితే తన వద్ద పనిచేసిన కార్మికులకు జీతాలు చెల్లించే విషయం మాత్రం మరిచిపోయాడు కేశినేని నాని. దాంతో జీతాల కోసం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కేశినేని నాని ట్రావెల్స్‌ బాధిత కార్మికులు దీక్షకు దిగారు.

తక్షణం తమకు బకాయిపడ్డ జీతాలను చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. ఆ మధ్య కేశినేని నాని తన ట్రావెల్స్ బస్సులను హఠాత్తుగా నిలిపేశాడు. కానీ ఆ సమయంలో కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు చెల్లించలేదు. లేబర్ కోర్టు ఆదేశించినా నాని జీతాలు ఇవ్వలేదు. దీంతో కార్మికులు నిరసనకు దిగారు.

కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కేశినేని నాని మోసం చేయడంపై వైసీపీ నేత పీవీపీ ట్విట్టర్లో స్పందించారు. ”వేలాది మంది పొట్ట కొట్టి ఈరోజు నువ్వు అందలమెక్కి కూర్చునావు ! కడుపుకాలి, ఆ కడుపుమంటతో, రోడ్డెక్కిన ఆ వేలాది కుటుంబాలను మనసుంటే ఆదుకో, లేదంటే సంకనాకిపోతావు.. నీ బాస్ లాగా” అంటూ పీవీపీ ట్వీట్ చేశారు.

First Published:  26 July 2019 6:06 AM IST
Next Story