Telugu Global
NEWS

ఫిఫా ర్యాంకింగ్స్ లో మరింత దిగజారిన భారత్

మొదటి రెండుర్యాంకుల్లో బెల్జియం, బ్రెజిల్ ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో భారత పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతోంది. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ప్రకటించిన తాజా.. ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 103వ ర్యాంక్ కు పడిపోయింది. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్యలో మొత్తం 204 దేశాలకు సభ్యత్వం ఉంటే.. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 103వ స్థానంలో ఉండటం విశేషం. ఇటీవలే ముగిసిన నాలుగు జట్ల ఇంటర్ కాంటినెంటల్ కప్ […]

ఫిఫా ర్యాంకింగ్స్ లో మరింత దిగజారిన భారత్
X
  • మొదటి రెండుర్యాంకుల్లో బెల్జియం, బ్రెజిల్

ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో భారత పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతోంది. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ప్రకటించిన తాజా.. ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 103వ ర్యాంక్ కు పడిపోయింది. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్యలో మొత్తం 204 దేశాలకు సభ్యత్వం ఉంటే.. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 103వ స్థానంలో ఉండటం విశేషం.

ఇటీవలే ముగిసిన నాలుగు జట్ల ఇంటర్ కాంటినెంటల్ కప్ సాకర్ టోర్నీలో భారత్ కనీసం ఒక్క విజయమూ సాధించకపోగా… రెండు పరాజయాలు, ఓ డ్రా ఫలితంతో 5 ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయింది.

తజకిస్థాన్ చేతిలో 2-4, ఉత్తర కొరియా చేతిలో 2-5 గోల్స్ తో పరాజయాలు పొందిన భారత్ …చివరకు సిరియాతో జరిగిన మ్యాచ్ ను 1-1తో డ్రాగా ముగించగలిగింది.

గత ఫిబ్రవరి లో 97, ఏప్రిల్ లో 101 ర్యాంకుల్లో నిలిచిన భారత్ ఓవరాల్ గా ఆరు ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోడం ద్వారా 103వ ర్యాంక్ కు పడిపోయింది.

టాప్ ర్యాంక్ లో బెల్జియం…

కాగా…ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను రెడ్ డెవిల్స్ బెల్జియం నిలబెట్టుకొంటే…కోపా అమెరికా విజేత బ్రెజిల్ రెండో ర్యాంక్ సంపాదించింది. 2018 సాకర్ ప్రపంచ చాంపియన్ ఫ్రాన్స్ మూడు, ఇంగ్లండ్ నాలుగు, ఉరుగ్వే ఐదు ర్యాంకుల్లో నిలిచాయి.

పోర్చుగల్ ఆరు, క్రొయేషియా ఏడు, కొలంబియా ఎనిమిది, స్పెయిన్ తొమ్మిది, అర్జెంటీనా టాప్ టెన్ ర్యాంక్ ల్లో ఉన్నాయి.
ఆఫ్రికా చాంపియన్ అల్జీరియా 28 స్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగుపరచుకుని 40వ ర్యాంక్ సంపాదించింది.

First Published:  26 July 2019 1:29 AM IST
Next Story