Telugu Global
Cinema & Entertainment

'డియర్ కామ్రేడ్' సినిమా రివ్యూ

రివ్యూ : డియర్ కామ్రేడ్ రేటింగ్ : 2.5/5 తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న, శ్రుతి రామచంద్రన్, జయ ప్రకాష్, రావు రమేష్, అనిష్ కురివిల్లా, బ్రహ్మాజీ, రఘు బాబు తదితరులు సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ నిర్మాత : యష్ రంగినేని దర్శకత్వం : భరత్ కమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో…. ఇప్పటికే […]

డియర్ కామ్రేడ్ సినిమా రివ్యూ
X

రివ్యూ : డియర్ కామ్రేడ్
రేటింగ్ : 2.5/5
తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న, శ్రుతి రామచంద్రన్, జయ ప్రకాష్, రావు రమేష్, అనిష్ కురివిల్లా, బ్రహ్మాజీ, రఘు బాబు తదితరులు
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
నిర్మాత : యష్ రంగినేని
దర్శకత్వం : భరత్ కమ్మ

బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో…. ఇప్పటికే ‘గీతగోవిందం’ సినిమాలో విజయ్ తో రొమాన్స్ చేసిన రష్మిక మండన్న హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

‘గీత గోవిందం’ సినిమాలో తమ అద్భుతమైన కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న ఈ సినిమాతో కూడా మంచి హిట్ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది.

కథ:

బాబి (విజయ్ దేవరకొండ) కాకినాడ యూనివర్సిటీ లో ఒక స్టూడెంట్ లీడర్. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ తో ఉన్న బాబి ప్రతి ఒక్కరితో గొడవకి దిగుతూ ఉంటాడు. ఒకరోజు అతను లిల్లి (రష్మిక మండన్న) ని చూసి వెంటనే ప్రేమలో పడిపోతాడు. లిల్లి కూడా బాబి ప్రేమ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ బాబీ గొడవలు పడే తత్వం ఆమెకు నచ్చదు. కొన్నాళ్ళకి అతనికి బ్రేకప్ చెబుతుంది.

దీంతో బాధలో కూరుకుపోయిన బాబీ తిరిగి ఆమె ప్రేమను పొందాలని అనుకుంటాడు. కానీ ఈలోపు లిల్లి కి కెరీర్ లో పెద్ద సమస్య వచ్చిపడుతుంది…. ఆ సమస్య ఏంటి? బాబీ లిల్లి ని కన్విన్స్ చేశాడా? చివరికి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటులు:

ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపిస్తూ వస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కూడా ఒక చాలెంజింగ్ పాత్రలో తన అద్భుతమైన నటనను కనబరిచాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో విజయ్ నటన సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

రష్మిక మందన్న కూడా సినిమాకి మరో ప్లస్ పాయింట్ అయింది. ఆమె అందంతో పాటు నటన, విజయ్ దేవరకొండ తో కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది రష్మిక మండన్న.

శృతి రామచంద్రానికి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఆమె తన నటనతో మంచి మార్కులే వేయించుకుంది. జయ ప్రకాష్ , బ్రహ్మాజీ చాలా సహజంగా నటించాడు. అనీష్ కురువిల్లా, రావు రమేష్ నటన సినిమాకి మరింత బలం చేకూర్చింది. రఘు బాబు కూడా బాగానే నటించాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమా కోసం మంచి కథను ఎంపిక చేశాడు. ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్న దర్శకుడు ఒక సింపుల్ కథను ఎంచుకున్నాడు.

అయితే దానిని తెరకెక్కించడంలో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. కథ బాగా ఉన్నప్పటికీ దర్శకుడు దానిని చూపించే విధానం చాలా స్లోగా కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపించటంతో…. ప్రేక్షకులు అంత బాగా కనెక్ట్ కాలేదు.

మైత్రి మూవీ మేకర్స్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం ఈ సినిమాకి వెన్నెముకగా మారింది. ఇప్పటికే రెండు మూడు పాటలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను అందుకున్నాయి. ఇక సినిమాలో అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని హైలైట్ చేసింది.

సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ ను చాలా అందంగా తెరకెక్కించాడు. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

విజయ్-రష్మీక ల కెమిస్ట్రీ, నేపధ్య సంగీతం

బలహీనతలు:

ఫస్ట్ హాఫ్ స్లో గా ఉండడం

చివరి మాట:

సినిమా లో ఒక మంచి మెసేజ్ వున్నప్పటికీ…. దర్శకుడు దానిని చూపించే విధానం అంత బాగా అనిపించదు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కువగా నడుస్తుంది.

అందులో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ల మధ్య ప్రేమ కథ పర్వాలేదనిపిస్తుంది. అందులో వచ్చే కామెడీ, రొమాన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే కథ కొంచెం స్లోగా నడుస్తుంది అని అనిపించినప్పటికీ విజయ్-రష్మిక ల కెమిస్ట్రీ ప్రేక్షకులను పెద్దగా బోర్ కొట్టించదు.

కానీ సెకండ్ హాఫ్ లో కథ కొంచెం ఎమోషనల్ గా మారుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లు అనిపిస్తాయి. విజయ్-రష్మిక ల కెమిస్ట్రీ, సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. కథలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది.

బాటమ్ లైన్:

‘డియర్ కామ్రేడ్’ ఒక మంచి మెసేజ్ ఉన్న మాములు ప్రేమ కథ.

First Published:  26 July 2019 5:51 AM GMT
Next Story