Telugu Global
CRIME

బీ ఫార్మ‌సీ స్టూడెంట్ కిడ్నాప్ కేసులో కొత్త నిజాలు !

హైద‌రాబాద్‌లోని హ‌య‌త్‌న‌గ‌ర్‌లో బీ ఫార్మ‌సీ విద్యార్థిని సోని కిడ్నాప్ అయి నాలుగురోజులైంది. ఈ కేసులో ఇప్పుడు ఓ చిన్న క్లూ దొరికింది. కారులో అమ్మాయి ని తీసుకొని వెళ్ళిన వ్యక్తి ని పోలీసులు గుర్తించారు. కారును దొంగ‌త‌నం చేసిన నిందితుడు అదే కారులో సోనిని కిడ్నాప్ చేశాడు. కారు అస‌లు ఓన‌ర్ రావడంతో నిందితుడిని పోలీసులు గుర్తించారు. యువ‌తిని కిడ్నాప్ చేసిన వ్య‌క్తిని ఐతం రవి శంకర్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణా జిల్లా ధవులూరు గ్రామంకు […]

బీ ఫార్మ‌సీ స్టూడెంట్ కిడ్నాప్ కేసులో కొత్త నిజాలు !
X

హైద‌రాబాద్‌లోని హ‌య‌త్‌న‌గ‌ర్‌లో బీ ఫార్మ‌సీ విద్యార్థిని సోని కిడ్నాప్ అయి నాలుగురోజులైంది. ఈ కేసులో ఇప్పుడు ఓ చిన్న క్లూ దొరికింది. కారులో అమ్మాయి ని తీసుకొని వెళ్ళిన వ్యక్తి ని పోలీసులు గుర్తించారు. కారును దొంగ‌త‌నం చేసిన నిందితుడు అదే కారులో సోనిని కిడ్నాప్ చేశాడు. కారు అస‌లు ఓన‌ర్ రావడంతో నిందితుడిని పోలీసులు గుర్తించారు.

యువ‌తిని కిడ్నాప్ చేసిన వ్య‌క్తిని ఐతం రవి శంకర్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణా జిల్లా ధవులూరు గ్రామంకు చెందిన ఐతం రవి శంకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. మూడు రాష్ట్రాల్లో అతడిపై కేసులు ఉన్నాయి. పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని ర‌విశంక‌ర్ తిరుగుతున్నాడు.

వారం రోజుల కింద‌ట‌ కర్ణాటక లో సీబీఐ ఆఫీసర్ నని చెప్పి కారు దొంగిలించాడు. దృష్టి మళ్ళించి ప్రజలను మోసం చేసి చోరీలు చేయడం ర‌వి శంక‌ర్‌కు మొద‌టి నుంచి అల‌వాటు. రవి శంకర్ కోసం కర్నాట‌క‌, విజయవాడలో ప్రత్యేక పోలీస్ టీమ్స్ తో గాలింపు చేప‌ట్టారు.

అయితే ఉద‌యం నుంచి కారులో తిరిగిన ర‌విశంక‌ర్ ఎక్క‌డా కారు దిగ‌లేదు. దీంతో సీసీ కెమెరాల్లో అత‌ని మొహం రికార్డు కాలేదు. కారుకు ఉన్న నెంబ‌ర్ త‌ప్పుడు కావ‌డంతో పోలీసులు క్లూ కోసం వెతుకుతున్నారు. కారులో ఎటు వెళ్లి ఉంటాడు? బెంగ‌ళూరు వైపు వెళ్లాడా? లేక విజ‌య‌వాడ వైపు వెళ్ల‌డా? అనే కోణంలో విచార‌ణ చేస్తున్నారు. మొత్తం మూడు టీమ్‌లు వేట కొన‌సాగిస్తున్నాయి.

First Published:  25 July 2019 11:58 PM GMT
Next Story