గౌరవంగా తప్పుకోండి.. లేదంటే తొలగిస్తాం...
టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవుల్లో పాటు సలహాదారులు, నిపుణులు, కన్సలెంట్లుగా నియమితులైన వారిని కొత్త ప్రభుత్వం తొలగిస్తోంది. టీడీపీ హయాంలో నియమితులైన సలహాదారులు, కన్సలెంట్లు, నామినేటెడ్ పదవుల వారిని తొలగించాల్సిందిగా ఆదేశిస్తూ అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. నామినేటెడ్ పదవుల్లో ఉండే వారు స్వచ్చందంగా, గౌరవప్రదంగా తప్పుకోవాల్సిందిగా వారికి సంబంధిత శాఖలు ఆదేశాలు జారీ చేయాలని… లేని పక్షంలో తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేయాల్సిందిగా సిసోడియా తన […]
టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవుల్లో పాటు సలహాదారులు, నిపుణులు, కన్సలెంట్లుగా నియమితులైన వారిని కొత్త ప్రభుత్వం తొలగిస్తోంది.
టీడీపీ హయాంలో నియమితులైన సలహాదారులు, కన్సలెంట్లు, నామినేటెడ్ పదవుల వారిని తొలగించాల్సిందిగా ఆదేశిస్తూ అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
నామినేటెడ్ పదవుల్లో ఉండే వారు స్వచ్చందంగా, గౌరవప్రదంగా తప్పుకోవాల్సిందిగా వారికి సంబంధిత శాఖలు ఆదేశాలు జారీ చేయాలని… లేని పక్షంలో తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేయాల్సిందిగా సిసోడియా తన ఆదేశాల్లో సూచించారు. గత ప్రభుత్వం నియమించిన ఇలాంటి వారిని తొలగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చంద్రబాబు హయాంలో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల పేరుతో సంబంధిత శాఖల్లో నిపుణుల పేరుతో అనేకమందిని ఎక్కువ వేతనాలకు తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ చాలా మంది టీడీపీ నేతలు కొనసాగుతూనే ఉన్నారు. ప్రభుత్వ వాహనాలను కూడా వారు వాడుకుంటున్నారు. ఈనేపథ్యంలో కొత్త ప్రభుత్వం వారిని తక్షణం తొలగించాలని నిర్ణయం తీసుకుంది.