Telugu Global
NEWS

టీవీ5, ఏబీఎన్‌, ఈటీవీపై వేటు వేసిన స్పీకర్

శాసనసభ నిబంధనలను ఉల్లంఘించి ప్రసారాలు సాగించిన టీవీ5, ఏబీఎన్, ఈటీవీపై ఏపీ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. ఈ మూడు చానళ్లకు అసెంబ్లీలోకి అనుమతి నిరాకరించారు. అసెంబ్లీ జరుగుతుండగా… అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడే వారి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వకూడదన్న నిబంధన ఉంది. అయితే సభ జరుగుతుండగానే సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు మీడియా పాయింట్ వద్దకు వచ్చి మాట్లాడారు. ఆ సమయంలో ఈ మూడు చానళ్లు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను కాకుండా టీడీపీ నేతల మీడియా పాయింట్‌ […]

టీవీ5, ఏబీఎన్‌, ఈటీవీపై వేటు వేసిన స్పీకర్
X

శాసనసభ నిబంధనలను ఉల్లంఘించి ప్రసారాలు సాగించిన టీవీ5, ఏబీఎన్, ఈటీవీపై ఏపీ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. ఈ మూడు చానళ్లకు అసెంబ్లీలోకి అనుమతి నిరాకరించారు.

అసెంబ్లీ జరుగుతుండగా… అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడే వారి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వకూడదన్న నిబంధన ఉంది.

అయితే సభ జరుగుతుండగానే సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు మీడియా పాయింట్ వద్దకు వచ్చి మాట్లాడారు. ఆ సమయంలో ఈ మూడు చానళ్లు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను కాకుండా టీడీపీ నేతల మీడియా పాయింట్‌ లైన్‌ను ఇచ్చాయి.

ఈ విషయాన్ని గుర్తించిన స్పీకర్ ఈ మూడు చానళ్లకు అసెంబ్లీలోకి అనుమతించలేదు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిని స్పీకర్ అసెంబ్లీలోకి అనుమతించలేదని.. అందుకే అసెంబ్లీ సమావేశాలను ప్రసారం చేయలేకపోతున్నామని ఏబీఎన్ ప్రకటించింది.

శానసనసభ గౌరవాన్ని తగ్గించేలా ఈ చానళ్లు వ్యవహరిస్తున్నాయని అధికారపక్షం వాదిస్తోంది. టీవీ5 ఏకంగా ఏపీలో మత ఘర్షణలు లేపేలా తప్పుడు వార్తలు కూడా ప్రసారం చేస్తోందని మండిపడుతున్నారు.

టీటీడీ విషయంలోనూ తప్పుడు కథనాలు ప్రసారం చేసిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించడంతో…. వెనక్కు తగ్గి తాము తప్పుడు వార్తను ప్రసారం చేశామని టీవీ5 క్షమాపణ కూడా చెప్పింది.

First Published:  26 July 2019 8:09 AM IST
Next Story