Telugu Global
NEWS

ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సలహా మండలి ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు…. నామినేటెడ్ పదవులలోను, కాంట్రాక్టు పనులలోనూ 50 శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో పాటు గిరిజనుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదకొండు […]

ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సలహా మండలి ఏర్పాటు
X

ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.

ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు…. నామినేటెడ్ పదవులలోను, కాంట్రాక్టు పనులలోనూ 50 శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో పాటు గిరిజనుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పదకొండు మంది సభ్యులతో ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలికి ఉప ముఖ్యమంత్రి, గిరిజన నాయకురాలు పుష్ప శ్రీవాణిని చైర్ పర్సన్ గా నియమిస్తూ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన గిరిజన సలహా మండలిలో ఆరుగురు గిరిజన ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు.

నూతనంగా ఏర్పాటైన గిరిజన సలహా మండలి సభ్యులుగా ఎమ్మెల్యేలు కళావతి, భాగ్యలక్ష్మి, తెల్లం బాలరాజు, రాజన్న దొర, చెట్టి పల్గుణ, ధనలక్ష్మి ఉన్నారు. రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ గిరిజనుల అభివృద్ధిపై ఈ సలహా మండలి ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.

11 మంది సభ్యులున్న గిరిజన సలహా మండలిలో చైర్ పర్సన్ తో సహా ఏడుగురు ప్రజాప్రతినిధులే కావడం గమనార్హం. ఈ సలహా మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించి గిరిజనుల స్థితిగతులపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు ఇతర రాష్ట్రాలలో కూడా పర్యటించి అక్కడి గిరిజనుల పరిస్థితులపై అంచనా వేస్తారని చెబుతున్నారు. నూతనంగా గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి బహిర్గతం అయ్యిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.

First Published:  25 July 2019 4:18 AM IST
Next Story