Telugu Global
NEWS

వినూత్నంగా టోక్యో ఒలింపిక్స్ పతకాల ఆవిష్కరణ

ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఒలింపిక్స్ పతకాలు 50 వేల టన్నుల వ్యర్థాల నుంచి 5 వేల పతకాలు జపాన్ రాజధాని టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే 2020 ఒలింపిక్స్ లో విజేతలకు బహుకరించే పతకాలను జపాన్ ఒలింపిక్ సంఘం వినూత్నంగా ఆవిష్కరించింది. వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా నిలిచే జపాన్…టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల కోసం ఓ వినూత్న పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఎలక్ట్ర్రానిక్ వ్యర్థాల నుంచి పతకాలు… క్రీడల వేదిక టోక్యో నగరంలో గుట్టలుగుట్టలుగా పేరుకు పోయిన […]

వినూత్నంగా టోక్యో ఒలింపిక్స్ పతకాల ఆవిష్కరణ
X
  • ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఒలింపిక్స్ పతకాలు
  • 50 వేల టన్నుల వ్యర్థాల నుంచి 5 వేల పతకాలు

జపాన్ రాజధాని టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే 2020 ఒలింపిక్స్ లో విజేతలకు బహుకరించే పతకాలను జపాన్ ఒలింపిక్ సంఘం వినూత్నంగా ఆవిష్కరించింది.

వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా నిలిచే జపాన్…టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల కోసం ఓ వినూత్న పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

ఎలక్ట్ర్రానిక్ వ్యర్థాల నుంచి పతకాలు…

క్రీడల వేదిక టోక్యో నగరంలో గుట్టలుగుట్టలుగా పేరుకు పోయిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇతర కంప్యూటర్ పరికరాల ఇ-వేస్ట్ వ్యర్థాలను రిసైకిల్ చేయడం ద్వారా లభించిన స్వర్ణ,రజత, కాంస్య లోహాలను ఉపయోగించి…పతకాలను తయారు చేయటానికి రంగం సిద్ధం చేసింది.

5వేల పతకాలు సిద్ధం…

ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచిన వారి కోసం మొత్తం 5 వేల వరకూ స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అవసరమని నిర్వాహక సంఘం అంచనావేసింది.

ఈ పతకాలకు అవసరమైన బంగారం, వెండి, కంచు లోహాలను.. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచే సేకరించారు.

2018 నవంబర్ నాటికే 47 వేల 488 టన్నుల ఇ-వేస్ట్ ను సేకరించి…మొత్తం ఎనిమిది టన్నుల బంగారు, రజత, కంచు ను సమీకరించారు. వీటితోనే టోక్యో ఒలింపిక్స్ పతకాలను తయారు చేయనున్నారు.

స్వర్ణ పతకాలకు అసరమైన బంగారాన్ని 28.4 కిలోలు, 3వేల 500 కిలోల వెండిని, 2వేల 700 గ్రాముల కంచు లోహాలను… ఇ-వేస్ట్ నుంచి రాబట్టగలిగారు.

పోటీల ప్రారంభంనాటికి… మొత్తం 50 వేల టన్నుల వ్యర్థాల నుంచి 5 వేల పతకాల లక్ష్యాన్ని చేరుకోగలమన్న ధీమాతో నిర్వాహక సంఘం ఉంది.

2018 నవంబర్ వరకూ సేకరించిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వ్యర్థాలలో… 51 లక్షల స్మార్ట్ ఫోన్లు సైతం ఉన్నాయి.

First Published:  25 July 2019 11:12 AM IST
Next Story