Telugu Global
NEWS

రామసుబ్బారెడ్డి పై జంట హత్యల కేసు కొట్టివేత

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కి ఊరట లభించింది. జంట హత్యల కేసులో రామసుబ్బారెడ్డి ని నిర్దోషిగా సుప్రీం కోర్టు ప్రకటించింది. 28 ఏళ్ళ నాటి షాద్ నగర్ జంట హత్యల కేసును కొట్టేసింది. ఈ కేసులో రామసుబ్బారెడ్డి 23 నెలల పాటు జైల్లో ఉండి వచ్చారు. 1990 డిసెంబర్ 5న ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరినీ షాద్ నగర్ బస్ స్టాండ్ వద్ద చంపేశారు. ఈ కేసులో కింది కోర్టులు రామసుబ్బారెడ్డి ని దోషిగా తేల్చాయి. […]

రామసుబ్బారెడ్డి పై జంట హత్యల కేసు కొట్టివేత
X

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కి ఊరట లభించింది. జంట హత్యల కేసులో రామసుబ్బారెడ్డి ని నిర్దోషిగా సుప్రీం కోర్టు ప్రకటించింది. 28 ఏళ్ళ నాటి షాద్ నగర్ జంట హత్యల కేసును కొట్టేసింది.

ఈ కేసులో రామసుబ్బారెడ్డి 23 నెలల పాటు జైల్లో ఉండి వచ్చారు. 1990 డిసెంబర్ 5న ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరినీ షాద్ నగర్ బస్ స్టాండ్ వద్ద చంపేశారు.

ఈ కేసులో కింది కోర్టులు రామసుబ్బారెడ్డి ని దోషిగా తేల్చాయి. కానీ సుప్రీంలో ఊరట లభించింది. నిర్దోషిగా సుప్రీం కోర్టు ప్రకటించింది.

అయితే ఇటీవలే ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కలిసి పోయారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

First Published:  25 July 2019 3:31 AM GMT
Next Story