పయ్యావులకు పదవిపై అసంతృప్తి
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్ పదవి అప్పగించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్ లు అసంతృప్తితో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఎవరికి వారు పీఏసీ పదవి వస్తుందని ఆశించారు. కానీ అనూహ్యంగా పయ్యావులకు చంద్రబాబు పదవి అప్పగించారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు తమను వాడుకుంటూ… సభలో సైలెంట్‌గా ఉంటూ వచ్చిన పయ్యావులకు పదవి ఇవ్వడం ఏమిటని ముగ్గురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. పయ్యావుల కేశవ్ బీజేపీలోకి వెళ్తానని […]

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్ పదవి అప్పగించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్ లు అసంతృప్తితో ఉన్నారు.
ఈ ముగ్గురు కూడా ఎవరికి వారు పీఏసీ పదవి వస్తుందని ఆశించారు. కానీ అనూహ్యంగా పయ్యావులకు చంద్రబాబు పదవి అప్పగించారు.
అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు తమను వాడుకుంటూ… సభలో సైలెంట్‌గా ఉంటూ వచ్చిన పయ్యావులకు పదవి ఇవ్వడం ఏమిటని ముగ్గురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు.
పయ్యావుల కేశవ్ బీజేపీలోకి వెళ్తానని చేసిన బ్లాక్‌మెయిల్‌కు చంద్రబాబు లొంగారని… పార్టీని నమ్ముకుని పోరాటం చేస్తున్న తమకు మాత్రం మొండి చేయి చూపించారని ముగ్గురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు.