నళినికి 30 రోజుల పెరోల్
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న నళినికి 30 రోజుల పెరోల్ లభించింది. ఆమె కుమార్తె వివాహం పనులు చూసుకోవడానికి ఈ పెరోల్ మంజూరయింది. రాజీవ్ గాంధి హత్య కేసులో ఒక ముద్దాయి అయిన నళిని గత 28 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నది. నళిని శ్రీహరన్ భారతీయ కారాగారంలో అత్యంత ఎక్కువ కాలం శిక్ష అనుభవించిన మహిళా ఖైదీగా రికార్డులకెక్కింది. ఈ శిక్షా కాలంలో ఇంత దీర్ఘకాలం పెరోల్ లభించడం ఇదే మొదటి […]
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న నళినికి 30 రోజుల పెరోల్ లభించింది. ఆమె కుమార్తె వివాహం పనులు చూసుకోవడానికి ఈ పెరోల్ మంజూరయింది.
రాజీవ్ గాంధి హత్య కేసులో ఒక ముద్దాయి అయిన నళిని గత 28 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నది. నళిని శ్రీహరన్ భారతీయ కారాగారంలో అత్యంత ఎక్కువ కాలం శిక్ష అనుభవించిన మహిళా ఖైదీగా రికార్డులకెక్కింది. ఈ శిక్షా కాలంలో ఇంత దీర్ఘకాలం పెరోల్ లభించడం ఇదే మొదటి సారి. 2016లో ఆమె తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనటానికి గాను మొదటిసారిగా 12 గంటల ఎమర్జెన్సీ పెరోల్ లభించింది.
మద్రాసు హైకోర్టు నళినికి జులై 5న పెరోల్ మంజూరు చేసింది. చివరికి గురువారం ఉదయం ఆమె శిక్ష అనుభవిస్తున్న వెల్లూరు కేంద్ర కారాగారం నుంచి ఆమె విడుదలయింది. జైలు బయటికి వచ్చిన నళినిని ఆమె బంధువు ఒకరు తీసుకు వెళ్ళారు.
ఈ 30 రోజుల పెరోల్ కాలంలో నళిని మీడియా తో మాట్లాడటం కాని, కలవడం కాని చేయకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది హైకోర్టు. అట్లాగే ఆమె ఈ కాలంలో అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేసింది. నళిని కోసం బంధువులు… ఈ నెల రోజులు ఉండటం కోసం వెల్లూరులోనే తీసుకున్న ఓ అద్దె ఇంటిలో ఉంటూ…. కుమార్తె వివాహం జరిపిస్తున్నారు. నళిని కుమార్తె హరిత్ర శ్రీహరన్ వెల్లూరు జైల్లోనే జన్మించింది. ప్రస్తుతం ఆమె యూకే లో వైద్యవృత్తిలో ఉంది.
నళిని 1991లో రాజీవ్ గాంధి హత్యకేసులో అరెస్టయింది. టాడా కోర్టు, సుప్రీం కోర్టు ఆమెకి మరణ శిక్ష విధించాయి.. అయితే తమిళనాడు గవర్నమెంటు దానిని 2000లో యావజ్జీవ శిక్షగా మార్చింది.