చిన్నారి జషిత్ క్షేమం
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్ అయిన నాలుగేళ్ల చిన్నారి జషిత్ క్షేమంగా తల్లి ఒడిని చేరాడు. నాలుగు రోజలు క్రితం జషిత్ ను కొందరు దుండగులు కిడ్నాపు చేశారు. అప్పటి నుంచి తూర్పు గోదావరి పోలీసులు జషిత్ కోసం గాలింపును ముమ్మరం చేశారు. అయితే గురువారం ఉదయం ఆరుగంటలకు కిడ్నాపర్లు చిన్నారి జషిత్ ను తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు. స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తూర్పు గోదావరి […]
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్ అయిన నాలుగేళ్ల చిన్నారి జషిత్ క్షేమంగా తల్లి ఒడిని చేరాడు. నాలుగు రోజలు క్రితం జషిత్ ను కొందరు దుండగులు కిడ్నాపు చేశారు. అప్పటి నుంచి తూర్పు గోదావరి పోలీసులు జషిత్ కోసం గాలింపును ముమ్మరం చేశారు.
అయితే గురువారం ఉదయం ఆరుగంటలకు కిడ్నాపర్లు చిన్నారి జషిత్ ను తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు. స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ చిన్నారి జషిత్ ను తలిదండ్రులకు అప్పగించారు.
దీంతో మూడు రోజులుగా ఆందోళనగా ఉన్న జషిత్ తలిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంటికి వచ్చిన చిన్నారి తలిదండ్రులను చూసి ఒక్కసారిగా అమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తలిదండ్రులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.
చిన్నారి జషిత్ ను క్షేమంగా తమకు అందించినందుకు పోలీసులకు జషిత్ తలిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి జషిత్ క్షేమంగా తిరిగి ఇంటికి రావడంతో మండపేటలో ఆనందోత్సాహాలు వ్యక్తం అయ్యాయి.
చిన్నారి జషిత్ ఆరోగ్యంగానే ఉన్నారని ఎస్పీ నయిూం అన్నారు. జషిత్ ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఏకంగా పది మంది డిఎస్పీలు, 20 మంది ఎస్ఐలు చిన్నారి జషిత్ కోసం గాలించారు.
కిడ్నాపర్లు క్రికెట్ బెట్టింగులో డబ్బు కోల్పోయారని, దాన్ని రాబట్టుకునేందుకే ఈ కిడ్నాప్ చేశారని భావిస్తున్నారు.
చిన్నారి జషిత్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.