Telugu Global
Cinema & Entertainment

మహర్షి నాకు లాభమే తెచ్చింది

మహర్షి సినిమాను ముగ్గురు నిర్మాతలు తెరకెక్కించారు. వీళ్లలో దిల్ రాజు నేరుగా పెట్టుబడి పెడితే, పాత లెక్కల ప్రకారం పీవీపీ కొంత మినహాయించుకొని ఇంకాస్త పెట్టారు. అశ్వనీదత్ అయితే పూర్తిగా ఇచ్చిన అడ్వాన్స్, దాని ఇంట్రెస్టులు లెక్కేసి స్లీపింగ్ పార్టనర్ గా కొనసాగారని టాక్. మొత్తమ్మీద ముగ్గురూ కలిసి మహర్షి తీశారు. అయితే దీని బడ్జెట్ మాత్రం హద్దులు దాటేసింది. వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే థియేట్రికల్ కింద 110 కోట్లకు వెళ్లింది. దీంతో నిర్మాతలకు […]

మహర్షి నాకు లాభమే తెచ్చింది
X

మహర్షి సినిమాను ముగ్గురు నిర్మాతలు తెరకెక్కించారు. వీళ్లలో దిల్ రాజు నేరుగా పెట్టుబడి పెడితే, పాత లెక్కల ప్రకారం పీవీపీ కొంత మినహాయించుకొని ఇంకాస్త పెట్టారు. అశ్వనీదత్ అయితే పూర్తిగా ఇచ్చిన అడ్వాన్స్, దాని ఇంట్రెస్టులు లెక్కేసి స్లీపింగ్ పార్టనర్ గా కొనసాగారని టాక్.

మొత్తమ్మీద ముగ్గురూ కలిసి మహర్షి తీశారు. అయితే దీని బడ్జెట్ మాత్రం హద్దులు దాటేసింది. వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే థియేట్రికల్ కింద 110 కోట్లకు వెళ్లింది. దీంతో నిర్మాతలకు వడ్డీలు పోగా ఏమీ మిగల్లేదంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు.. కేవలం ఈ కోపంతోనే ప్రస్తుతం మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి దిల్ రాజు తప్పుకున్నట్టు ప్రచారం కూడా జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని దిల్ రాజు ఖండించాడు.

తను ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు.. తనపై నడుస్తున్నదంతా పుకారుగా కొట్టిపడేశాడు. మహర్షి సినిమా తనకు లాభాలు తెచ్చిపెట్టిందని అంటున్నాడు. అంతేకాదు, ఇప్పుడు చేస్తున్న సరిలేరు నీకెవ్వరు ప్రాజెక్టులో కూడా తను భాగస్వామిగా కొనసాగుతున్న విషయాన్ని నిర్థారించాడు.

అయితే మహర్షితో తనకు లాభం వచ్చిందని చెబుతూనే, పారితోషికం విషయంలో హీరోలు మారాలంటూ లెక్చర్ అందుకున్నాడు దిల్ రాజు. బాలీవుడ్ తరహాలో హీరోలంతా లాభాల్లో వాటాలు తీసుకోవాలని, ఇలా చేయడం వల్ల నిర్మాతకు భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే మహేష్ లాంటి హీరోలు ఇలా లాభాలు తీసుకుంటున్నారని, మిగతా హీరోలు కూడా ఈ బాటలోకి రావాలని కోరుతున్నాడు దిల్ రాజు.

First Published:  25 July 2019 3:38 PM IST
Next Story