ఏపీలో మరో ఎన్నికలు.... బాబు, పవన్ పొత్తుకు రెడీ !
ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన టీడీపీని ఈ ఎన్నికల్లో గెలిపించుకునేందుకు తాజాగా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు అధికారంలో ఉండడం…. జగన్ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడంతో టీడీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. క్యాడర్ వైసీపీలోకి వెళ్లలేదు. ఆ బలంతోనే జగన్ ను దెబ్బకొట్టడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీచేయాలని డిసైడ్ అవ్వడం ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. […]
ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన టీడీపీని ఈ ఎన్నికల్లో గెలిపించుకునేందుకు తాజాగా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.
మొన్నటి వరకు అధికారంలో ఉండడం…. జగన్ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడంతో టీడీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. క్యాడర్ వైసీపీలోకి వెళ్లలేదు. ఆ బలంతోనే జగన్ ను దెబ్బకొట్టడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీచేయాలని డిసైడ్ అవ్వడం ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచింది.
తాజాగా జగన్ సర్కారు కొత్త మున్సిపాల్టీల ఏర్పాటు.. మున్సిపల్స్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఏపీలో మున్సిపాలిటీల కాలపరిమితి ముగిసి ప్రస్తుతం అధికారుల పాలనలో ఉన్నాయి. ఈ గెలుపు ఊపులో వాటిని క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ.. పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.
కోర్టు కేసుల ను పరిష్కరించి ఎన్నికలకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక ఏపీలో దెబ్బతిన్న దృష్ట్యా జగన్ ను ఎదుర్కోవాలంటే కలిసి పోటీచేయడమే ఉత్తమమని చంద్రబాబు తాజాగా పవన్ ను కలిసి పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగన్ హవాను అడ్డుకోవాలంటే కలిసి పోరాడాల్సిందేనని జనసేన కేడర్ కూడా పవన్ కళ్యాణ్ కు చెప్పినట్టు సమాచారం. ఒకే ఒక స్థానానికి పరిమితమైన జనసేనకు ఇప్పుడు సొంతంగా పోటీచేసే బలం లేదు. అందుకే టీడీపీతో కలిసి మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవాలని అనుకుంటోంది. టీడీపీ ఆఫర్ తో జగన్ ను కట్టడి చేయాలని చూస్తోంది. మరి టీడీపీ, జనసేన అధికార వైసీపీ ని ఏమేరకు అడ్డుకుంటాయో చూడాలి.