Telugu Global
NEWS

పీపీఏల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు

విద్యుత్ ఒప్పందాలను సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. జీవో 63పై నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. అంత వరకు పీపీఏపై సమీక్ష జరపవద్దని ఆదేశించింది. విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 40 విద్యుత్‌ కంపెనీలు హైకోర్టులో 15 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై దాదాపు నాలుగు గంటల పాటు వాదనలు సాగాయి. పీపీఏను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని… ఈఆర్‌సీ నిర్ణయం […]

పీపీఏల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
X

విద్యుత్ ఒప్పందాలను సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. జీవో 63పై నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. అంత వరకు పీపీఏపై సమీక్ష జరపవద్దని ఆదేశించింది.

విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 40 విద్యుత్‌ కంపెనీలు హైకోర్టులో 15 పిటిషన్లు దాఖలు చేశాయి.

ఈ పిటిషన్లపై దాదాపు నాలుగు గంటల పాటు వాదనలు సాగాయి. పీపీఏను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని… ఈఆర్‌సీ నిర్ణయం మేరకు, బిడ్డింగ్, పబ్లిక్ హియరింగ్ జరిపిన తర్వాతే ధరలు నిర్ణయించారని కంపెనీలు వాదించాయి.

వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. అప్పటి వరకు సమీక్ష కోసం జారీ చేసిన జీవోపై స్టే ఇచ్చింది.

పీపీఏలపై చర్చలకు రావాలంటూ కంపెనీలకు ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది హైకోర్టు.

First Published:  25 July 2019 5:44 AM GMT
Next Story