రంగంలోకి కవిత.. ఇక యాక్టివ్.. టార్గెట్ ఇదే..
పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లో కవిత ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. ఎందుకంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సత్తాచాటారు ఆమె. కానీ నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడంతో పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరిగారు. మనస్థాపంతో నిజామాబాద్ లో కూడా అడుగుపెట్టడం లేదట…. ఓడిపోయామన్న మనస్తాపంతో కవిత ఎక్కువగా బయటకు రావడం లేదని అంటున్నారు. ఇక నిజామాబాద్ రాజకీయాల్లో కవిత మార్క్ లేక పార్టీ శ్రేణులు, […]
పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లో కవిత ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. ఎందుకంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సత్తాచాటారు ఆమె. కానీ నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడంతో పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరిగారు. మనస్థాపంతో నిజామాబాద్ లో కూడా అడుగుపెట్టడం లేదట…. ఓడిపోయామన్న మనస్తాపంతో కవిత ఎక్కువగా బయటకు రావడం లేదని అంటున్నారు.
ఇక నిజామాబాద్ రాజకీయాల్లో కవిత మార్క్ లేక పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ నేతలు స్తబ్దుగా ఉన్నారట. బోనాలు, ఇతర ముఖ్య అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కవిత దూరంగా ఉండిపోయేసరికి అసలు టీఆర్ఎస్ ఉనికే నిజామాబాద్ లో ప్రశ్నార్థకంగా తయారైందట.
అయితే తాజాగా కవిత పార్టీ కోసం పనిచేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఎంపీ అరవింద్ టీఆర్ఎస్ నేతలను లాగేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో…. నిజామాబాద్ కార్పొరేషన్ సహా మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడానికి కవిత మరోసారి తనే రంగంలోకి దిగాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
నిజామాబాద్ లో కవిత వస్తేనే గెలుస్తామని నేతల నుంచి విజ్ఞప్తులు రావడంతో కవిత మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.
టీఆర్ఎస్ లో అసలు మహిళల ప్రాధాన్యమే తక్కువ. కవిత లాంటి బలమైన నేతలు ఇప్పుడు మౌనంగా ఉంటే పార్టీకి నష్టమని.. అందుకే బయటకు రావాలని అక్కడి ప్రజల కోరిక మేరకు కవిత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.