Telugu Global
NEWS

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కు శృంగభంగం

లంచ్ విరామానికి ముందే 85కు ఆలౌట్  పసికూన ఐర్లాండ్ బౌలర్ల వీరవిహారం వన్డే ప్రపంచకప్ విజయంతో గాల్లో తేలిపోతున్న ఇంగ్లండ్ జట్టును…టెస్ట్ క్రికెట్ పసికూన నేలమీదకు దించింది. క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా ఐర్లాండ్ తో ప్రారంభమైన నాలుగురోజుల టెస్ట్ మ్యాచ్ తొలిరోజు ఆట లంచ్ విరామానికి ముందే ఇంగ్లండ్ 85 పరుగులకే పేకమేడలా కూలింది. ఏకపక్షంగా సాగుతుందనుకొన్న ఈ మ్యాచ్ లో…లార్డ్స్ గ్రీన్ టాప్ వికెట్ పై టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లండ్ టాపార్డర్… ఐర్లాండ్ […]

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కు శృంగభంగం
X
  • లంచ్ విరామానికి ముందే 85కు ఆలౌట్
  • పసికూన ఐర్లాండ్ బౌలర్ల వీరవిహారం

వన్డే ప్రపంచకప్ విజయంతో గాల్లో తేలిపోతున్న ఇంగ్లండ్ జట్టును…టెస్ట్ క్రికెట్ పసికూన నేలమీదకు దించింది. క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా ఐర్లాండ్ తో ప్రారంభమైన నాలుగురోజుల టెస్ట్ మ్యాచ్ తొలిరోజు ఆట లంచ్ విరామానికి ముందే ఇంగ్లండ్ 85 పరుగులకే పేకమేడలా కూలింది.

ఏకపక్షంగా సాగుతుందనుకొన్న ఈ మ్యాచ్ లో…లార్డ్స్ గ్రీన్ టాప్ వికెట్ పై టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లండ్ టాపార్డర్… ఐర్లాండ్ పేసర్ల జోడీ ముర్టాగ్, అడెయిర్ దెబ్బతో టపటపా రాలిపోయింది.

ఓపెనర్లు జేసన్ రాయ్ 5, డెన్లే 23, కెప్టెన్ రూట్ 2 పరుగులకు అవుట్ కాగా…బెయిర్ స్టో, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్ డకౌట్లుగా వెనుదిరిగారు.

లోయర్ ఆర్డర్లో సామ్ కరెన్ పోరాడి ఆడి 18, స్టోన్ 19 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ 23.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌటయ్యింది.

టామ్ ముర్టాగ్ పాంచ్ పటాకా…

ఐర్లాండ్ ఓపెనింగ్ బౌలర్ టామ్ ముర్టాగ్ 9 ఓవర్లలో 13 పరుగులిచ్చి 5 వికెట్లు, అడెయిర్ 3, ర్యాంకిన్ 2 వికెట్లు పడగొట్టారు.

లార్డ్స్ వేదికగా జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ తొలిరోజు ఆటలో లంచ్ విరామానికి ముందే ఇంగ్లండ్ ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి.

అంతేకాదు..1997 లో ఆస్ట్ర్రేలియాతో ఆడిన టెస్ట్ తర్వాత స్వదేశంలో అతితక్కువ స్కోరుకే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియడం విశేషం.

ఈ మ్యాచ్ ద్వారా జేసన్ రాయ్, స్టోన్ ఇంగ్లండ్ జట్టు సభ్యులుగా, ఐర్లాండ్ తరపున మార్క్ అడెయిర్ ..టెస్ట్ అరంగేట్రం సాధించగలిగారు.

First Published:  24 July 2019 3:19 PM IST
Next Story