Telugu Global
CRIME

బొల్లినేని గాంధీ ఆస్తుల అటాచ్

ఈడీ మాజీ అధికారి, చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు అయిన బొల్లినేని గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే బొల్లినేని గాంధీ అక్రమాస్తులపై సీబీఐ కేసులు నమోదు చేయగా… తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కేసులు నమోదు చేసింది. ఈడీలో ఉంటూ చంద్రబాబుకు అనుకూలంగా 13 ఏళ్ల పాటు చక్రం తిప్పిన బొల్లినేని గాంధీ… సుజనాచౌదరికి కూడా ఎనలేని మేలు చేస్తూ వచ్చారు. సుజనా కేసులను నీరుగారుస్తూ ఆయన్ను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఇటీవల బొల్లినేని గాంధీ […]

బొల్లినేని గాంధీ ఆస్తుల అటాచ్
X

ఈడీ మాజీ అధికారి, చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు అయిన బొల్లినేని గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే బొల్లినేని గాంధీ అక్రమాస్తులపై సీబీఐ కేసులు నమోదు చేయగా… తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కేసులు నమోదు చేసింది.

ఈడీలో ఉంటూ చంద్రబాబుకు అనుకూలంగా 13 ఏళ్ల పాటు చక్రం తిప్పిన బొల్లినేని గాంధీ… సుజనాచౌదరికి కూడా ఎనలేని మేలు చేస్తూ వచ్చారు. సుజనా కేసులను నీరుగారుస్తూ ఆయన్ను రక్షించే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో సీబీఐ ఇటీవల బొల్లినేని గాంధీ పై దాడులు చేసింది. 200 కోట్ల అక్రమాస్తులను గుర్తించింది. 2010-19 మధ్య కాలంలో బొల్లినేని గాంధీ ఆస్తుల విలువ ఏకంగా 288 శాతం పెరిగినట్టు సీబీఐ, ఈడీ గుర్తించాయి.

బొల్లినేని గాంధీపై కేసు నమోదు చేసిన ఈడీ… అతడికి సంబంధించిన ఆస్తులన్నింటినీ జప్తు చేయనుంది. బొల్లినేని గాంధీ… భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది.

బొల్లినేని గాంధీ ఈడీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే జగన్ కేసులో ఏదో ఒక ఆస్తిని అటాచ్ అంటూ ప్రకటన విడుదల చేసేవాడు. దాంతో చంద్రబాబుకు ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేవాడు.

First Published:  24 July 2019 5:53 AM IST
Next Story