జోడి టీజర్ టాక్.... ఆది ఈ సారైనా హిట్ కొట్టేనా?
ఆది సాయి కుమార్ హీరో గా, జెర్సీ సినిమా తో తెరంగేట్రం చేసిన భామ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘జోడి’. ఈ సినిమా ని చాగంటి ప్రొడక్షన్స్ సంస్థ పై పద్మజ మరియు సాయి వెంకటేష్ గుణ్ణం నిర్మిస్తున్నారు. విశ్వనాధ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో కి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమా కి సంబందించిన టీజర్ ని ఈ రోజు చిత్ర […]

ఆది సాయి కుమార్ హీరో గా, జెర్సీ సినిమా తో తెరంగేట్రం చేసిన భామ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘జోడి’. ఈ సినిమా ని చాగంటి ప్రొడక్షన్స్ సంస్థ పై పద్మజ మరియు సాయి వెంకటేష్ గుణ్ణం నిర్మిస్తున్నారు.
విశ్వనాధ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో కి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమా కి సంబందించిన టీజర్ ని ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎప్పుడో రెడీ అయినా, ఈ సినిమా మాత్రం ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ కి నోచుకుంటుంది.
#Jodi Starring #AadiSaiKumar @ShraddhaSrinath#JodiTeaser
➡️ https://t.co/ji7p70hl1Y— Movie Volume (@movievolume) July 24, 2019
ఈ మధ్య నే ఆది నుండి వచ్చిన చిత్రం ‘బుర్ర కథ’. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం తో ఆది కి ఈ ‘జోడి’ సినిమా తప్పకుండా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లో మంచి విజువల్స్, మంచి నేపథ్య సంగీతం అయితే ఉన్నాయి. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి…!