Telugu Global
NEWS

మున్సిపల్ చట్టానికి గవర్నర్ బ్రేక్.. కేసీఆర్ కు షాక్

అనుకున్నట్టే అయ్యింది. కేసీఆర్ కు బీజేపీ తొలి షాకిచ్చిందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి ఆమోదించిన మున్సిపల్ చట్టానికి తాజాగా గవర్నర్ నరసింహన్ మోకాలడ్డారు. ఈ బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపడం సంచలనంగా మారింది. మున్సిపల్ చట్టంలోని లోపాలపై బీజేపీ, కాంగ్రెస్, ప్రతిపక్షాలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశాయి. దీంతో పాటు కొత్త బిల్లులో కలెక్టర్లకు సర్వాధికారాలు కల్పించడం నిబంధలనకు వ్యతిరేకమని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న గవర్నర్ ఈ […]

మున్సిపల్ చట్టానికి గవర్నర్ బ్రేక్.. కేసీఆర్ కు షాక్
X

అనుకున్నట్టే అయ్యింది. కేసీఆర్ కు బీజేపీ తొలి షాకిచ్చిందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి ఆమోదించిన మున్సిపల్ చట్టానికి తాజాగా గవర్నర్ నరసింహన్ మోకాలడ్డారు.

ఈ బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపడం సంచలనంగా మారింది. మున్సిపల్ చట్టంలోని లోపాలపై బీజేపీ, కాంగ్రెస్, ప్రతిపక్షాలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశాయి. దీంతో పాటు కొత్త బిల్లులో కలెక్టర్లకు సర్వాధికారాలు కల్పించడం నిబంధలనకు వ్యతిరేకమని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న గవర్నర్ ఈ బిల్లును వెనక్కి పంపి కేసీఆర్ కు షాకిచ్చారు.

నిజానికి గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ కు మాంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో ఒక్కరోజులోనే అన్నీ ఆమోదించేస్తారు. గవర్నర్ కు చెప్పి మరీ కేసీఆర్ అన్ని పనులు చేస్తుంటారు. వీరిద్దరూ జోడెద్దుల్లా ఇన్నాళ్లు సాగారు.

అయితే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి ఏర్పడ్డాక కేసీఆర్ తో దోస్తీ చెడింది. పైగా గవర్నర్ల మార్పులో నరసింహన్ ను తీసేయకుండా ఉంచింది. ఇప్పుడు గవర్నర్ బీజేపీ చెప్పుచేతుల్లోకి పోయారని టీఆర్ఎస్ అనుమానిస్తోంది.

అందుకే రాష్ట్ర బీజేపీ నేతలు వ్యతిరేకించిన ఈ మున్సిపల్ బిల్లును గవర్నర్ వెనక్కి పంపి కేసీఆర్ కు షాకిచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 18, 19న కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా బిల్లును ఆమోదిస్తే గవర్నర్ ఇప్పుడు వెనక్కి పంపడం సంచలనంగా మారింది. దీంతో సవరణలతో కేసీఆర్ సర్కారు ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

First Published:  23 July 2019 5:20 PM IST
Next Story