Telugu Global
National

కుప్పకూలిన కుమారస్వామి ప్రభుత్వం

కర్నాటకలో పది రోజుల రాజకీయ నాటకానికి తెర పడింది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. కర్నాటకలో ఆరు ఓట్ల తేడాతో జేడీఎస్ అధినేత, ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. పది రోజుల క్రితం కర్నాటకలో రాజకీయ క్రీడ ప్రారంభమైంది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన శాసనసభ్యులు ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. 15 మంది […]

కుప్పకూలిన కుమారస్వామి ప్రభుత్వం
X

కర్నాటకలో పది రోజుల రాజకీయ నాటకానికి తెర పడింది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

కర్నాటకలో ఆరు ఓట్ల తేడాతో జేడీఎస్ అధినేత, ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. పది రోజుల క్రితం కర్నాటకలో రాజకీయ క్రీడ ప్రారంభమైంది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన శాసనసభ్యులు ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం ఇరుకున పడింది.

రాజీనామ చేసేందుకు సిద్ధ పడిన ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కర్నాటకలో కుమారస్వామి అధికారంలో ఉండాలో, లేదో తేల్చేందుకు కోర్టులను సైతం ఆశ్రయించారు. అయితే చివరకు మంగళవారం సాయంత్రం బెంగళూరు శాసనసభలో జరిగిన ఓటింగ్ లో కుమారస్వామి ప్రభుత్వం మెజార్టీ లేకపోవడంతో ఓడిపోయింది.

మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు స్పీకర్ శాసనసభలో ఓటింగ్ చేపట్టారు. శాసనసభలో అధికారంలో కొనసాగాలంటే సంకీర్ణ ప్రభుత్వానికి 103 మంది ఎమ్మెల్యేల మద్దుతు కావాల్సి ఉంది. అయితే ఈ మ్యజిక్ ఫిగర్ ను అందుకోలేకపోవడంతో కూమారస్వామి ప్రభుత్వం పడిపోయింది. స్పీకర్ రమేష్ కుమార్ బలపరీక్షను డివిజన్ వారీగా చేపట్టారు.

దీనిని అనుసరించి కర్నాటక శాసనసభలో సభ్యులను ఒక లైను తర్వాత మరో లైనుగా అధికారులు ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక సభ్యులను లెక్కించారు. ఇద్దరు అధికారులు ఈ లెక్కలను దగ్గరుండి రాసుకున్నారు. దాదాపు అరగంట తర్వాత ఈ లెక్కలు తేలి కుమారస్వామి సర్కార్ వీగిపోయినట్లుగా స్పీకర్ ప్రకటించారు.

ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది సభ్యులు ఓటు వేస్తే వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి. శాసనసభలో మెజార్టీ తేల్చే సమయంలో 18 మంది సభ్యులు గైర్హాజర్ అయ్యారు. దీంతో కుమారస్వామి సర్కార్ కుప్పకూలిపోయింది.

ముంబాయిలో బస చేసిన ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవాలనుకున్న కాంగ్రెస్, జేడీఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిణామాలతో కర్నాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. బుధవారం ఉదయం గవర్నర్ ను భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కలిసే అవకాశం ఉంది. శాసనసభలో తమకు మెజార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరే అవకాశాలున్నాయి.

First Published:  23 July 2019 5:36 PM IST
Next Story