Telugu Global
NEWS

జిందాల్ చేతికి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్

మధ్యలో ఆగిపోయిన బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇది వరకు గాలి జనార్దన్‌ రెడ్డి బ్రహ్మణి పేరుతో ఈ ప్లాంట్‌ నిర్మాణం మొదలుపెట్టారు. ఆతర్వాత కేసులతో నిర్మాణం ఆగిపోయింది. భూముల కేటాయింపును నాటి ప్రభుత్వం రద్దు చేసింది. జగన్‌ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తిరిగి స్టీల్ ప్లాంట్ నిర్మాణం తెరపైకి వచ్చింది. జమ్మలమడుగు పర్యటనకు ఇటీవల వచ్చిన జగన్ డిసెంబర్‌ 26న ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన […]

జిందాల్ చేతికి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్
X

మధ్యలో ఆగిపోయిన బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇది వరకు గాలి జనార్దన్‌ రెడ్డి బ్రహ్మణి పేరుతో ఈ ప్లాంట్‌ నిర్మాణం మొదలుపెట్టారు. ఆతర్వాత కేసులతో నిర్మాణం ఆగిపోయింది. భూముల కేటాయింపును నాటి ప్రభుత్వం రద్దు చేసింది.

జగన్‌ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తిరిగి స్టీల్ ప్లాంట్ నిర్మాణం తెరపైకి వచ్చింది. జమ్మలమడుగు పర్యటనకు ఇటీవల వచ్చిన జగన్ డిసెంబర్‌ 26న ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ప్లాంట్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎలా చేయబోతోంది అన్న దానిపై చర్చ నడుస్తున్న సమయంలో…. ప్రముఖ జిందాల్ కంపెనీకి ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.

ప్లాంట్ నిర్మాణం జరిగే ప్రాంతంలో జిందాల్ కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. బ్రహ్మణి కంపెనీ చేసిన నిర్మాణాలను పరిశీలించారు. బ్రహ్మణి కార్యాలయంలో ప్లాంట్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన మ్యాప్‌ను పరిశీలించారు.

స్థానిక అధికారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ సూచనల మేరకే తాము ప్లాంట్‌ను పరిశీలించేందుకు వచ్చామని జిందాల్ ప్రతినిధులు మీడియాతో చెప్పారు. ఇక్కడి వాతావరణం, నీటి లభ్యత, భూములను పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక ఇస్తామన్నారు.

First Published:  23 July 2019 3:42 AM IST
Next Story