Telugu Global
NEWS

మూడువారాల్లో ఐదు స్వర్ణాలు

యూరోప్ టూర్లో హిమా దాస్ బంగారు పరుగు  హిమాదాస్ పై ప్రశంసల వెల్లువ భారత సంచలన రన్నర్, అసోం ఎక్స్ ప్రెస్ హిమా దాస్ ఏడాది విరామం తర్వాత వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. యూరోపియన్ అథ్లెటిక్స్ టూర్ లో భాగంగా వివిధ దేశాలలో జరిగిన 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు విభాగాలలో ఐదు బంగారు పతకాలు సాధించి వారేవ్వా అనిపించుకొంది. మూడువారాల వ్యవధిలో ఐదు స్వర్ణాలు సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. పోలెండ్ గడ్డపై […]

మూడువారాల్లో ఐదు స్వర్ణాలు
X
  • యూరోప్ టూర్లో హిమా దాస్ బంగారు పరుగు
  • హిమాదాస్ పై ప్రశంసల వెల్లువ

భారత సంచలన రన్నర్, అసోం ఎక్స్ ప్రెస్ హిమా దాస్ ఏడాది విరామం తర్వాత వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. యూరోపియన్ అథ్లెటిక్స్ టూర్ లో భాగంగా వివిధ దేశాలలో జరిగిన 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు విభాగాలలో ఐదు బంగారు పతకాలు సాధించి వారేవ్వా అనిపించుకొంది.

మూడువారాల వ్యవధిలో ఐదు స్వర్ణాలు సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

పోలెండ్ గడ్డపై బంగారు బోణీ..

పోలెండ్ వేదికగా జరిగిన పోజ్నాన్ గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ మీట్ మహిళల 200 మీటర్ల పరుగులో 19 ఏళ్ల హిమదాస్..23.65 సెకన్లలో గమ్యం చేరి ప్రస్తుత సీజన్లో తొలి బంగారు పతకం అందుకొంది.

జులై 8న పోలెండ్ వేదికగానే జరిగిన కుటానో అథ్లెటిక్స్ మీట్ 200 మీటర్ల పరుగులో సైతం 23.97 సెకన్ల రికార్డుతో రెండో స్వర్ణం అందుకొంది.

జులై 13న చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన క్లాడానో అథ్లెటిక్స్ మీట్ 200మీటర్ల పరుగులోనూ హిమా దాస్ కు ఎదురేలేకపోయింది. 23.43 సెకన్ల టైమింగ్ తో స్వర్ణాల హ్యాట్రిక్ పూర్తి చేసింది.

జులై 14న చెక్ రిపబ్లిక్ వేదికగానే ముగిసిన మరో అంతర్జాతీయ రేస్ 200మీటర్ల పరుగులో హిమాదాస్ 23.25 సెకన్ల టైమింగ్ తో నాలుగో బంగారు పతకం సాధించింది.

ప్రాహా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ మహిళల 400 మీటర్ల రేస్ లో హిమాదాస్ 52. 09 సెకన్ల టైమింగ్ తో బంగారు పతకం సాధించింది.

జులై నెల మూడువారాలలో హిమా దాస్ ఐదు స్వర్ణాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ప్రధాని మోడీ, మాస్టర్ సచిన్ హ్యాట్సాఫ్…

భారత్ కు చెందిన ఓ యువతి మూడువారాలలో ఐదు బంగారు పతకాలు సాధించడం అపూర్వమని ప్రధాని నరేంద్ర మోడీ, మాస్టర్ సచిన్ టెండుల్కర్…గోల్డెన్ గర్ల్ హిమదాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

దేశంలోని కో్ట్లాదిమంది నవతరానికి హిమాదాస్ స్ఫూర్తిగా నిలిచిపోతుందని ప్రధాని కొనియాడారు.

భారత యువవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ సైతం..సలాం బాస్ అంటూ హిమా దాస్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.

First Published:  23 July 2019 5:34 PM IST
Next Story