Telugu Global
NEWS

కాంగ్రెస్ దీనస్థితికి ఆయనే కారణమా?

తెలంగాణ కాంగ్రెస్ లో నైరాశ్యం అలుముకుంటోంది. మొత్తం 19మంది గెలిస్తే ఇప్పటికే 12మంది కారెక్కేశారు. మిగిలిన ఏడుగురిలో ముగ్గురు నలుగురు అయితే పక్కాగా కాంగ్రెస్ లోనే ఉంటారు. అంటే కాంగ్రెస్ బలం కేవలం ముగ్గురేనా..? నిజానికి ఈ పరిస్థితి రావడానికి అసలు కారణం రాహుల్ గాంధీనే అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఓటమి నుంచి తేరుకోవడానికి.. కాంగ్రెస్ ను నడిపించడానికి.. నేత లేకుండా పోయారు. ఆ ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే గోవాలో […]

కాంగ్రెస్ దీనస్థితికి ఆయనే కారణమా?
X

తెలంగాణ కాంగ్రెస్ లో నైరాశ్యం అలుముకుంటోంది. మొత్తం 19మంది గెలిస్తే ఇప్పటికే 12మంది కారెక్కేశారు. మిగిలిన ఏడుగురిలో ముగ్గురు నలుగురు అయితే పక్కాగా కాంగ్రెస్ లోనే ఉంటారు. అంటే కాంగ్రెస్ బలం కేవలం ముగ్గురేనా..? నిజానికి ఈ పరిస్థితి రావడానికి అసలు కారణం రాహుల్ గాంధీనే అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఓటమి నుంచి తేరుకోవడానికి.. కాంగ్రెస్ ను నడిపించడానికి.. నేత లేకుండా పోయారు. ఆ ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే గోవాలో మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అయ్యారు. తెలంగాణలో విలీనం బాట పట్టారు. కన్నడలోనూ రాజీనామాలు చేస్తున్నారు. కర్ణాటకలో సంక్షోభ సమయంలో వెన్నంటి ఉండడానికి ఢిల్లీ నుంచి ఎవరూ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఏపీలో కాంగ్రెస్ కాడిని కూడా రఘువీరా రెడ్డి వదిలేసి రాజీనామా చేశారు.

తెలంగాణలో పూర్తి తీసికట్టుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పక్కచూపులు చూస్తున్నారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో యాక్టివ్ గా లేరు.

ఈ నేపథ్యంలో వచ్చే 2024 వరకు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా నాయకత్వ లోపాలు సరిదిద్దుకొని ముందుకుసాగితే ఆ పార్టీ మనుగడ ఉంటుందని.. లేదంటే చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు గంటా పథంగా చెబుతున్నారు.

First Published:  23 July 2019 5:30 PM IST
Next Story