Telugu Global
NEWS

కాషాయంలోకి ఎరుపు జెండాలు.... ఆకర్ష్ షురూ

తెలంగాణలో ఎలాగైనా బలపడాలని ఆశిస్తున్న బీజేపీ… ఇప్పుడు తెలంగాణలోని ప్రతిపక్షాలపై కన్నేసింది. కాంగ్రెస్ సహా టీడీపీ, ఇతర నేతలను లాగేసి బలపడాలనే స్కెచ్ గీస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ కూడా మొదలు పెట్టింది. ఇందుకోసం తాజాగా కమ్యూనిస్టులకు గాలం వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకోవడంతో మరింత జోష్ లో ఇప్పుడు తెలంగాణలో విస్తరణ బాట పట్టారట. ఇందుకోసం […]

కాషాయంలోకి ఎరుపు జెండాలు.... ఆకర్ష్ షురూ
X

తెలంగాణలో ఎలాగైనా బలపడాలని ఆశిస్తున్న బీజేపీ… ఇప్పుడు తెలంగాణలోని ప్రతిపక్షాలపై కన్నేసింది. కాంగ్రెస్ సహా టీడీపీ, ఇతర నేతలను లాగేసి బలపడాలనే స్కెచ్ గీస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ కూడా మొదలు పెట్టింది. ఇందుకోసం తాజాగా కమ్యూనిస్టులకు గాలం వేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకోవడంతో మరింత జోష్ లో ఇప్పుడు తెలంగాణలో విస్తరణ బాట పట్టారట. ఇందుకోసం కమ్యూనిస్టులు బలంగా ఉన్న కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకోవడానికి రెడీ అయ్యారు.

ఉత్తర తెలంగాణలో ఈ చేరికల బాధ్యతలను కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లకు అప్పగించారు. వారు ఈనెల 23న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి సొంత జిల్లా కరీంనగర్ లోని సీపీఐ జిల్లా అధ్యక్షుడు సహా మూడు వేల మంది నేతలకు బీజేపీ కండువా కప్పబోతున్నారు.

ఇక వరంగల్ , ఖమ్మం, నల్గొండ జిల్లాల బాధ్యతలను రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు లక్ష్మన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు చూసుకుంటున్నారు. ఈ జిల్లాల్లోని కమ్యూనిస్టులను కూడా ఆగస్టులో బీజేపీలోకి చేర్చుకునేలా చర్చలు జరుపుతున్నారట..

సో… అంతో ఇంతో కమ్యూనిస్టు పార్టీనే నమ్ముకొని బలంగా ఉండే కమ్యూనిస్టులు కూడా పార్టీలు మారుతుండడం.. అది కూడా బీజేపీలో చేరుతుండడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

First Published:  22 July 2019 12:32 AM IST
Next Story