అవును నేను వెళ్లిపోతున్నా
టీడీపీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలంతా సేప్టీ కోసం బీజేపీలో చేరిపోతున్నారు. ఇప్పటికే అనేక ఆర్థిక ఆరోపణలు ఉన్న సుజనాచౌదరి, సీఎం రమేష్ బీజేపీలో చేరిపోగా… ట్రాన్స్ ట్రాయ్ యజమాని, టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా బీజేపీలో చేరుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో ఈయన కంపెనీ అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ కూపీని ప్రభుత్వం లాగుతోంది. ఈనేపథ్యంలో రాయపాటి బీజేపీలోకి జంప్ అవుతున్నారు. బీజేపీలో చేరుతున్న […]
టీడీపీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలంతా సేప్టీ కోసం బీజేపీలో చేరిపోతున్నారు. ఇప్పటికే అనేక ఆర్థిక ఆరోపణలు ఉన్న సుజనాచౌదరి, సీఎం రమేష్ బీజేపీలో చేరిపోగా… ట్రాన్స్ ట్రాయ్ యజమాని, టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా బీజేపీలో చేరుతున్నారు.
పోలవరం ప్రాజెక్టులో ఈయన కంపెనీ అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ కూపీని ప్రభుత్వం లాగుతోంది. ఈనేపథ్యంలో రాయపాటి బీజేపీలోకి జంప్ అవుతున్నారు.
బీజేపీలో చేరుతున్న విషయాన్ని రాయపాటి కూడా వెల్లడించారు. త్వరలోనే తాను బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు. ఇటీవల బీజేపీ నేత రాంమాధవ్ కూడా రాయపాటిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రస్తుతం బీజేపీలో చేరితే తన కాంట్రాక్టుల విషయంలో, బ్యాంకు అప్పుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని రాయపాటి భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఏపీలో బలపడితే చాలు అనుకుంటున్న బీజేపీ కూడా … టీడీపీ నేతల అక్రమాలను వీక్‌నెస్‌లుగా వాడుకుంటూ ముందుకెళ్తోంది.