Telugu Global
NEWS

7 నెలలుగా సింధుకు టైటిల్ కరువు

అంతర్జాతీయ టోర్నీల్లో సింధు షరామామూలే… ఇండోనీషియన్ ఫైనల్లో సింధుకు యమగుచి షాక్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో పీవీ సింధు టైటిళ్ల లేమి కొనసాగుతూనే ఉంది. గత ఏడుమాసాలుగా ఒక్క టైటిల్ గెలుపు లేకుండా సింధు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంది. తొలిరౌండ్ నుంచి సెమీస్ వరకూ అలవోక విజయాలు సాధించడం…ఫైనల్లో చేతులెత్తేయడం సింధుకు ఓ బలహీనతగా మారిపోయింది. జకార్తాలో ముగిసిన 2019 ఇండోనీషియన్ ఓపెన్ ఫైనల్లో అకానే యమగుచి వరుస గేమ్ ల్లో నాలుగో సీడ్ సింధును చిత్తు చేసింది. […]

7 నెలలుగా సింధుకు టైటిల్ కరువు
X
  • అంతర్జాతీయ టోర్నీల్లో సింధు షరామామూలే…
  • ఇండోనీషియన్ ఫైనల్లో సింధుకు యమగుచి షాక్

అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో పీవీ సింధు టైటిళ్ల లేమి కొనసాగుతూనే ఉంది. గత ఏడుమాసాలుగా ఒక్క టైటిల్ గెలుపు లేకుండా సింధు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంది.

తొలిరౌండ్ నుంచి సెమీస్ వరకూ అలవోక విజయాలు సాధించడం…ఫైనల్లో చేతులెత్తేయడం సింధుకు ఓ బలహీనతగా మారిపోయింది.

జకార్తాలో ముగిసిన 2019 ఇండోనీషియన్ ఓపెన్ ఫైనల్లో అకానే యమగుచి వరుస గేమ్ ల్లో నాలుగో సీడ్ సింధును చిత్తు చేసింది.

టైటిల్ సమరంలో యమగుచి పవర్ గేమ్ తో సింధును బిత్తరపోయేలా చేసింది. 21-15, 21-16తో అలవోక విజయం సాధించింది.

సింధు ప్రత్యర్థిగా 2-8 రికార్డుతో ఉన్న యమగుచి ప్రస్తుత ఈ టైటిల్ విజయంతో తన రికార్డును3-8 తో మెరుగుపరచుకో గలిగింది.

జపాన్ ఓపెన్ పైనే సింధు ఆశలు…

వరుస పరాజయాలు, టైటిళ్ల లేమితో ఉక్కిరిబిక్కిరవుతున్న సింధు…జపాన్ ఓపెన్లో సైతం 5వ సీడ్ హోదాతో టైటిల్ వేటకు దిగుతోంది.

వెటరన్ సైనా నెహ్వాల్ 8వ సీడ్ గా తన అదృష్టం పరీక్షించుకోనుంది. జపాన్ ఓపెన్ తొలిరౌండ్లో.. చైనా ప్లేయర్ హాన్ యూతో సింధు తలపడనుంది.

First Published:  22 July 2019 4:41 PM IST
Next Story